పుట:ASHOKUDU.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ చంపక నగరమునఁ జంపావతీనదీ తీరమునం గలవిష్ణు మందిర సామీప్యమునందుఁ గొంతమంది బ్రాహ్మణులు వాసము చేయుచుండిరి. అది వైశాఖమాసము—ఒక బ్రాహ్మణ కన్యక నదీజలముల స్నానము చేసి శుచియె భక్తి భావముతో మాధవుని బూజించుటకై దేవాలయమునకుఁ బోయెను. అచ్చట వలమల్లి కాకుసుమములతోడను, దులసీదూర్వాంకురములతోడను, శ్వేతచందనాదికముల తోడను మాధవుని బూజించి యా బాలిక మరల గృహాభీముఖయై వచ్చుచుండెను. ఆమె పచ్చని పట్టు చీరను ధరించియుండెను ఆమెకపోలములు శ్వేత చందన చర్చితములై యుండెను. ఆ బాలిక దక్షిణ కరంబునఁ జిన్ని జలకలశమును, వామకరంబునఁ బూలపళ్ళేరమును గలవు. ఆ బాలిక యతిత్వరితముగ వచ్చ చుఁ దమ యింటిగుమ్మముక డనొక యపరిచితుఁడు నిలువఁబడి యుండు టను జూచెను. ఆతఁడొక బ్రాహ్మణుఁడు-అతని హస్తమునందొక పుస్తక ముండెను; గృహ స్వామిని దర్శింప వలయునని యాతఁ డచ్చటనుండి నిరీక్షించుచుండెను. ఆ బాలిక నాతఁడు దూరమునుండియే చూచుచుండెను, ఆమె సమీపించిన తోడనే యాబ్రాహ్మణుఁడామెతో " నేనిచ్చట నిరీక్షించు చుంటినని నీ జనకునితోఁ జెప్పుము ” అనియెను.

బాలిక లోపలికిఁబోయి యాసంగతి తండ్రితోఁ జెప్పెను. గృహస్థుకు వెలుపలికి వచ్చిన తోడనే యా బ్రాహ్మణుఁడాతనితోఁ, దానొక దైవజ్జుఁ డనని చెప్పెను. అయుదు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/11&oldid=332998" నుండి వెలికితీశారు