పుట:2030020025431 - chitra leikhanamu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వీటికి కాడలు లేవు. ఈఫలములు శాఖల కంటియుండును. ఒక్కొక్కటి యొక్కొక్క కప్పునందు నిర్మింపబడియుండును. ఈపండ్లు పక్వముగాకముందు ఆకుపచ్చగను, పక్వమైనతరువాత ఎఱుపుగ నుండును.

ఊడలు:- ఈయూడలవలననే యీచెట్టు పెద్దదిగ పెరిగి పెద్దభవనమునకు పోల్పబడుచున్నది. కొమ్మలనుండి యీయూడలు క్రిందికి సమముగ పెరుగును. ఇవి భూమికి తాకునప్పటికి బలముగ నభివృద్ధిపొందును. తరువాత భూమిలోనికి పెరిగి వేళ్లవలె గట్టిగ నాటుకొనును. పిమ్మట నేచెట్టునుండి యవి పెరుగునో యాచెట్టుకును, వీటికిని విడదీసివేసినప్పటికిని ప్రత్యేకవృక్షముగ నభివృద్ధినొందును. ఇటులనే అనేకఊడలు పెరిగి చెట్టు నెంతో యభివృద్ధి నొందించును. ఈవిధముననేకదా రాజ్యముయొక్క వివిధభాగములు అభివృద్ధినొంది మాతృదేశము నత్యున్నతస్థితికి తేవచ్చును. కొన్నిసమయములం దీయూడలవలెనే మాతృదేశములతో సంబంధమును విడదీసికొని స్వతంత్రజీవనము సలుపును. ఈయూడలు స్తంభములకును, ఆకులు కప్పునకును పోల్పబడినవి. పెద్దభవనము మనుజుల కెటుల నివాసయోగ్యమో యీచెట్టు బాటసారుల కటులనే యుండును. గొప్పరాజ్యముతోను పెద్దభవనముతోను పోల్పబడిన వృక్షరాజము మనదేశమునందు పెరుగుటవలన మనము గర్వపడవలసినదే.

ఈచెట్టును జాగరూకతతో చిత్రించినయెడల భవనమువలె కానవచ్చును. అలసిన బాటసారులకు నీడనిచ్చిన యీచెట్టుయొక్క ఛాయను బాగుగ ప్రదర్శింపవలెను. దీనిక్రింద నొకబాటసారి శ్రమ దీర్చుకొనుచున్నటుల వ్రాసిన నెంతయో చక్కగ నుండును.

మామిడిచెట్టు.

ఈచెట్టుయొక్క నామము లోకవిదితమే కదా. దీనిపండ్లను భక్షింపని హైందవుడుండునా? ఈప్రసిద్ధివృక్షములు హిందూదేశమునందు లెక్కకు మిక్కిలిగలవు. ఇవి సాధారణముగ సమూహములుగ నుండును. ఒక్కచెట్టు విడిగా కానవచ్చుటయరుదు. మనుజులు దీనిఫలములను తినుట కనేకచెట్ల నొకచోట బాతెదరు. అందువలన మనదేశమునందు మామిడితోపు లనేకములు కలవు.

ఈచెట్టును మఱ్ఱిచెట్టువలె పలుదిక్కుల వ్యాపించును. దీనికి ఊడలు లేవు. అందువలన నిది మఱ్ఱిచెట్టంత పెద్దదిగ పెరుగలేదు. వటవృక్షపుకొమ్మలవలెనే దీనిదిగువకొమ్మలును భూమికి సమాంతరముగ పెరుగును. కొన్ని సూటిగా నాకాశపువైపునకు వ్యాపించును. ఈవృక్షపుకొమ్మలయందనేకగుంపు లుండును. దీనిబెరడును మఱ్ఱిబెరడువలెనే కరకుగా నుండును. దీనిపైని నాచు లేచునుకాని వటవృక్షము నాచు అంత తెల్ల్గ నుండును. ఈచెట్టుయొక్క కొమ్మలు వంకరటింకరుగ నుండును.

ఆకులు:- మామిడియాకు సాధారణముగ ఒకటిన్నర అంగుళము వెడల్పును, ఎనిమిదిఅంగుళముల పొడవును గలిగియుండును. వీటికాడలును పొట్టిగను ఆకుపచ్చమిశ్రిత మైనపసుపురంగుగ నుండును. ఈయాకులు చదునుగ నుండవు. కొన్నిసమయములయం దివి నిలుచుకొనియుండును. వీటిరంగు గాడమైన ఆకుపచ్చ. చెప్ప----- తిని. ప్రతిఆకుయొక్క క్రిందిభాగముకంటె మీదిభాగము దట్టమైనరంగును గలిగియుండును. ----------- సూర్యునివైపునకును, క్రిందిభాగము భూమివైపునకును తిరిగియుండును.

వసంతకాలమునందు దీనిచిగుళ్లు చూచుట కత్యానందముగ నుండును. వీటి ----------- చిగిర్చుకాలమునందు కొన్నిమామిడిచె ట్లెఱ్ఱనిబట్టను దాల్చినట్లుండును. ఆకుపచ్చ ---------- కొన్నిచెట్లు సగము చిగిర్చును. మఱికొన్ని చిగిర్చవు. అందువలన వసంతకాలమున ----------- రంగులను కలిగియుండును.

పుష్పించుకాలమునం దివి యెట్లు కానవచ్చునో కొంచెము చూతము. చిగిర్చి ------------- చినచెట్లు చిగిర్చవు. అందువలన సంపూర్ణముగ పుష్పించినచెట్టునం దొకయెఱ్ఱనియాకైనను -----------