పుట:2030020025431 - chitra leikhanamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుష్పమయమైయుండి పచ్చగ కానవచ్చును. అచ్చటచ్చట కొన్ని పచ్చని ఆకులు కానవచ్చుచుండును. ఫలించుకాలమును చూచుకొందము. ఈకాలమునం దన్ని మామిడిచెట్లును ఆకుపచ్చగనేయుండును. చిగుర్లన్నియు పచ్చని యాకులుగ మాఱును. అప్పుడు చెట్టున కనేకులాశ్రితు లుండెదరు. ఫలములతో నిండియున్న చెట్టుక్రింద నొక రిద్దఱు మనుజులుండినటుల వ్రాసిన బహుబాగుగ నుండును. అందువలన నాకాలమునందు మామిడిచెట్టుక్రిందనున్న చిన్నమొలక లన్నియు చచ్చి నున్నగ నుండును.

ఫలములు :- ఈఫలము లన్నియు నొకేవిధముగ నుండవు. 31 - 3 చూడుము.

కొన్ని గుండ్రముగను, కొన్నిపొడవుగను, కొన్ని చిన్నవిగను, మఱికొన్ని పెద్దవిగను ఉండును. పండినప్పుడు గూడవీటిరంగు వివిధములుగ మాఱుచుండును. కొన్ని ఫలములు కాయలవలెనే యాకుపచ్చగ నుండును. ఇది చెట్టంతయు వ్యాపించకపోయినప్పటికిని పెరిగినంతమట్టుకు దట్టముగ నేదోయొకకొమ్మపై నభివృద్ధిపొందును.

వేళ్లు:- మామిడివేళ్లు భూమియందు చాలవఱకు వ్యాపించును. పైని చెట్టెంతపెరుగునో లోపల వేళ్లంత పెరుగును. ఈవేళ్లు అచ్చటచ్చట పైకికానవచ్చుచుండును.

జామి చెట్టు.

ఈచెట్టు మామిడిచెట్టంతబలముగ నుండదు. దీని మొండెము సన్నముగ నుండును. కాని వంకరగను ---------టును, మఱ్ఱిచెట్టును మించియుండును. దీనియం ------------నుండవు. దీని మొరడు నున్నగను ------------- దీనియాకులరంగు మఱ్ఱి

దీనిపండ్లు పచ్చిగ నున్నపుడు ఆకుపచ్చగను,పండినతర్వాత పసుపుగనుండును. దీనిపువ్వులు తెల్లగను సుందరముగ నుండును. ఫలము పక్వమైనకొలదిని పుష్పముశుష్కించును. 32 - చూడుము.


గనించివ్రాయుట నభ్యసింపవలెను. ఇకను తుప్పలను చూతము.

గులాభిమొక్క. }}


ప్రేమింతురు. కావున దీని ననుదినమును మనము చూచుచుందుము. ఈమొక్క ---------- చెట్టువలె పెద్దదికాదు. సాధారణముగ భూమికి శాఖలు తగిలియేయుండును. అందువలన దీని