పుట:2030020025431 - chitra leikhanamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నిచెట్లయందు కొమ్మలు ఒకేచోటునుండి బయలువెడలును. ఇట్టిచెట్లు బహువిచిత్రముగ నుండును. 31 - 1 చూడుము.

మనవైపునకు వచ్చినకొమ్మలనుకాని, మనవైపునకు వ్యతిరిక్తముగ పెరుగుకొమ్మలనుకాని వ్రాయుట దుర్లభము. అప్పుడీకొమ్మలయొక్క వంకరలన్నియు చూపుచు వ్రాయుచుండవలెను. లేనియెడల చిత్రముయొక్క సౌందర్యమంతయు నశించును. ఇట్టికష్టములు వృక్షములకు ఆకులులేని కాలమునందు తటస్థించును. ఆకులున్నచో కొమ్మలంతగా కనబడవు. అందువలన నంతదుర్లభముగనుండదు. కనుక వేసవియందు చెట్లకొమ్మలను వ్రాయుట బహుసులభము.

ఆకులచే గప్పబడియున్న కొమ్మలు భారముచే వంగియుండును. ఆకులులేని కొమ్మ లంత వంగియుండవు.

కొన్నిచెట్లకొమ్మలు పొడవుగ నుండును. కొన్నిచెట్లకొమ్మలు పొట్టిగ నుండును. కొన్నికొమ్మలు సన్నముగను, పొడవుగ నుండును. కొన్ని పొట్టిగను దళముగనుండును. ఇట్టివన్నియు బాగుగ సృష్టియందు చూచుచుండవలెను. ఏయేచెట్లు యేయేకాలములయం దెట్లుండునో బాగుగ గమనింపవలెను. లేనియెడల నిట్టివి చక్కగ ప్రదర్శింపలేకపోదుము.

ఆకులు:- చెట్లయొక్క అన్నిభాగములకంటె ఆకులు ముఖ్యములు. ఆకులులేనిచెట్టు భర్తలేనిస్త్రీవలె నుండును. మొండెమును, కొమ్మలును, అస్థిపంజరమునకును, ఆకులు మాంసచర్మాదులకును పోల్పబడినవి. మాంసమును చర్మమును అస్థిపంజరమున కెటుల సౌందర్యమును కలుగజేయునో ఆకులు చెట్ల నటుల నలంకరించును. ఇట్టియాకులను వ్రాయుటయర్ చాలదుర్లభము. చిత్రించుటలో ప్రవీణత యున్నవాడు చెట్లశాఖలనుగూర్చి విస్తారము తెలియస్క పోయినను వ్రాసివేయగలడు. కాని ఆకుల నటుల చిత్రింపలేడు. అప్రవీణు లగుచిత్రకారులు ప్రతియాకును చిత్రించెదరు. అది తప్పు. చాల దగ్గరగనున్న కొమ్మలయాకులుమాత్రము విడివిడిగ కన్పడును కాని దూరముగనున్న నటుల కనుపడవు. అన్నియు కలసిపోవును కాన అన్నిచెట్ల యాకారములు నొకేవిధముగ నుండవు. సాధారణముగచిత్రించి వివిధ మైనచెట్ల రూపములను చక్కగ ప్రదర్శింపవచ్చును. అందువలననే ప్రతిచెట్టు ---------- వునందును గమనించుచుండవలెనని మొదటనుండి చెప్పుచువచ్చితిని.

మొదట మన మొకచిన్నకొమ్మను వ్రాయుట నేర్చుకొనవలయును. ఇందు ప్రతియాకును ములనీడ నొకబాట చిత్రమును పూర్తిచేయవలెను. ఇం దభ్యాసమైనతరువాతను కొంచెము పెద్దకొమ్మను వ్రాయస్థలమునందు కొన్ని