పుట:2030020025431 - chitra leikhanamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టిచిత్రములయందు ప్రతియాకును వ్రాయక దానియాకారము వచ్చునటుల గీతలను గీయుచుండవలెను. ఇటుల వ్రాయునపుడు అది యేజాతిచెట్టుయొక్క కొమ్మయో తెలిసికొనగలుగునటుల వ్రాయుటకు ప్రయత్నించుచుండవలెను.

గుమ్మడియాకునైనను, ఆముదపు ఆకునైనను అనేకవిధముల నుంచి వ్రాయుచు కొమ్మలను వ్రాయుటకూడ అభ్యసింపవలెను. ఇట్టియాకులు గలకొమ్మలకును తక్కిన కొమ్మలకును చాల భేదముండును. అందువలన నిట్టివి తప్పులు లేకుండ వ్రాయవచ్చును.

ఏచెట్టు ఏకాలమునందు సుందరముగ కానవచ్చునో, ఆచెట్టు నట్టికాలమునందేవ్రాయుట నభ్యసింపవలెను. అసహ్యమును పుట్టించు వస్తువులకంటె కన్నులపండువుగ నుండువస్తువులను వ్రాయుటకు మనము సాధారణముగ కుతూహలపడుచుందుము.

సూర్యుడు ప్రకాశించునప్పుడు సూర్యకిరణములు చెట్లపై బడి వాటికి వన్నెవన్నెలరంగులను తెచ్చుచుండును. వాటినీడ భూమిపై బడుచుండును. మంచు పడుచున్నపుడు సృష్టియందలి వస్తువులు బాగుగ కనపడవు. చీకటిరాత్రిసంగతి నిక చెప్ప నక్కఱలేదు. చంద్రకాంతిలో సృష్టి యంతబాగుగ కన్పడదు. అందువలన సాయంకాలముననో, ప్రాత:కాలముననో బయటికి వెళ్లి యేదోయొకచోటను కూర్చుండి చెట్లను వ్రాయుట నభ్యసింపవలెను. ప్రారంభికుల కిదియే మంచిసమయము.

మొదట చెట్ల నెందుకు వ్రాయుట నభ్యసింపగూడదు? కొమ్మల నెందుకు వ్రాయవలెను? అని మీరు నన్ను ప్రశ్నింపవచ్చును. లోపలిమర్మములు తెలియనిది వ్రాసిన నేమిలాభము? అక్షరాభ్యాసము చేయనిది నవలలను, ప్రబంధములను చదువుటకు యత్నించుట నవ్వులచేటు కాదా? అందువలన మీరు మొదట యాకులను, తరువాత కొమ్మలను, పిమ్మట చెట్లను వ్రాయుట నభ్యసింపవలెను.

చెట్టును వ్రాయునపుడు చిన్నచిన్నకొమ్మలవిషయమై విస్తారము శ్రమపుచ్చుకొనక పెద్దకొమ్మలనే బాగుగ చిత్రమునందు చూపుటకు ప్రయత్నించవలెను. ఏలయన: దూరమునకంత చిన్నకొమ్మలు కానరావు. అటులనే చెట్లయాకులు విడివిడిగ కన్పడవు. అన్నియు కలిసిపోయినటులుండును. ఈకొమ్మలను ఆకులను విడివిడిగ వ్రాయుటయం దింకొకలాభ మున్నది. కొన్నిసమయములయందు ఒకేచెట్టును వ్రాసి అం దివియన్నియు చూపించవలసియుండును. జాగ్రత్తగ నేర్చుకొనిన దెప్పటికిని వృధాయైపోదు. అట్టియభ్యాసము నిన్ను కష్టములనుండి తొలగించవచ్చు నేమో ఎవరెఱుగుదురు? అనేకవిధము లగుచెట్లను వ్రాయవలసివచ్చునపుడు ఇవియన్నియు నీ కుపయోగించును.

వివిధదూరములయం దుండుచెట్లు:- దూరముగ నుండుచెట్లయొక్క వివిధభాగము లంతబాగుగ కనపడవని యిదివఱకే చెప్పియుంటిని. ఒకచెట్లసమూహ మొకచోట నుండినయెడల భూమిలోనికి పెరిగిన యూడలతో నున్న మఱ్ఱిచెట్టువలె కనబడును. దూరముగను దగ్గరగ నుండుచెట్లకు చాలభేద ముండును. ప్రకృతిచిత్రము ననుసరించి మనము చిత్రించవలెనన్న దూరముగనున్నచెట్లు మనకెక్కువ కష్టము కలుగజేయును. ఆకాశపురంగునుబట్టియు, వేళనుబట్టియు, ఛాయనుబట్టియు చెట్లయొక్కరంగు మాఱుచుండును. అందువలన మనచిత్రమునం దవి యన్నియు చూపించవలసియుండును.

ఏయేచెట్లు ఎట్టిప్రదేశములయందు పెరుగునో గమనించవలెను. మఱ్ఱిచెట్టు ఇసుకనేలయందును, సరుగుడు --------- నేలయందును, జామచెట్లు రాళ్లయందును, ధాన్యము కొండమీదను పెరుగవు. అట్టిసమయము --------- చాలజాగరూకతతో మెలగవలెను. మనయిష్టముప్రకారము ఏదోయొకచెట్టు నెచ్చోటనో వ్రాసి------ రదగ్గరగ పుట్టును.కొన్నిదూరముగ నుండును. వీటిజాతి నైజమునుబట్టు యుండును.