పుట:2030020025431 - chitra leikhanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

చిత్రలేఖనము


రెండవ భాగము.

మొదటి ప్రకరణము.

మన మేదైనవస్తువును చూచి వ్రాయునపుడు మన దృష్టిమట్టమును బట్టి దానియెక్క రూపు మాఱు చుండును. ఈ విధమైన చిత్రలేఖనము నభ్యసించుటకు మనము మొదట నొకపెట్టెను తీసికొనవలెను. దానిమి మనము కొంత దూరముగ నుంచి వ్రాయుట ప్రారంభింపవలయును.

11చూడుము.

"క , ఖ "అనుగీత మనదృష్టికి సమానముగ నున్న దనుకొందము. మనచూపు "గ" అను చుక్కమీదికి బరగుచుండును. 1వ నెంబరు గీతలన్నియు "గ" దగ్గర కలియును. 2,3 నెంబరుల గీతలు సమానముగా గనబడును. ఈ పెట్టె మనదృష్టిమట్టమునకు దిగువనున్నది. గనుక దీని పైభాగము మనకు గనబడుచున్నది. సమానముగనున్న యెడల రెండువైపుల కనబడున. మీది భాగమును, ఎదుటిభాగమును కనబడును.

ఈ క్రిందిపెట్టె మనదృష్టికి కొంచెము దిగువను, ప్రక్కను నున్నది. అందువలన మూడువైపులు కనబడుచున్నవి. 'క, ఖ' అనుగీత ఏమి? యని మీరు నన్ను ప్రశ్నింప వచ్చును.సముద్రతీరమున నిలువబడిసముద్రము వైపునకు చూచినయెడల భూమికిని, ఆకాశమునకును, విడదీయురేఖయొకటి కానబడును. దీనినేదిగంతమందురు.ఇదియే యీగీత.

12 చూడుము.

ఈ క్రిందియుల్లు మనదృష్టిమట్టపుగీతకన్న నెత్తుగానున్నది. అందువలన ఇంటికప్పుయొక్క క్రిందిభాగము కనబడుచున్నది. ఏ వస్తువైనను దృష్టిమట్టపుగీతకు దిగువనున్నయెడల ఆ వస్తువుయొక్క పైభాగమును, దృష్టిమట్టపుగీతకు పైనయున్నయెడల ఆ వస్తువుయెక్క అడుగుభాగమును

13-3 చూడుము.