పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
12
దా స బా ర తి

    వడదాకి తొర్రల నడగిన పిట్టలు
            ముదముగ బైటను మ్రోగుచుండె
    కడు నెండవేడిమి న్గ్రాగిన గాడ్పు హా
            యిగ మంచుకొండకై యేగుచుండె
    కొండను దిగి మేతకొరకు బెబ్బులు లుమ్మి
             రిగ బల్లమ్ల జెలరేగుచుండె
    పాములకు బుట్టలలోనుండి పడగహెచ్చె
    మడుపు నెడబాసి యేనుంగు లడవిజొచ్చె
    ప్రొద్దు పడమటకు వ్య్రాలి ముద్దువచ్చె
    నెగడి జానకి వాలుకన్నుగన నిచ్చె.

సీ॥ ఎల్లపిల్లలు గూళ్ళకెక్కగ గుడ్లగూ
             బలు ఋషిపక్షులుం బయలుడాసె
      వైదేహి దురవస్థ పరికింపలేనట్లు
             ఖిన్నుడై సూర్యుండుకన్నుమూసె
      వనవు: గుంకుమము నాకసమున సంజయ
              న్పేరావపెద్దమ యారబోసె
     అంచెలుగా నక్క లరచుచు దెసలందు
              ధరణిజ కష్టంబు నెఱుకజేసె
     చీకటిముసుంగునన్ భూమి చింతబండె
     చుక్కలు న్పీతకై మింట బొక్కుచుండె
     బొదలి దవుదివ్వెలుగ గొండపోళ్ళు మండె
     జనకజకు నప్పు ఉష్టమశనియు నిండె