పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46

క చ్చ పీ శ్రు తు లు

5.ప్రహ్లాద చరిత్రము

                     ----
16.పూర్వ కవులు:

   గీ॥ పూర్వకవు లందరున్ గడు పూజ్యు లందు
        భాగవతులయి గోస్తనీ పాకముగను
        గృతులొనర్చు నధికుల సంస్కృతమున లయ
        దేవు దెనుగున బొతము వెలిసి యెంతు.

17.ఆధునిక కవులు:

   సీ॥ పూర్వప్రబంధము పోల్కికై చచ్చిన
                    యీగ నంటిచెడు హీను డొకడు
          ప్రౌఢకల్పన లని పన్ని తనకుదానె
                    యర్ధం బెఱుగలేని వ్యర్దు డొకడు
          కృతిని నిఘంటువు వెతకి ముదురుతాటి
                    ముంజె వలె న్జేయు మూర్ఖు డొకడు
          తేటతెల్లంబని తెన్గుబాసకు బట్ట
                    తెరచి చూపించెడి దేజె యొకడు.

         కవినశంబున శారదకలుషయయ్యె
         బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె
         అచ్చు చవకయ్యె మూడులు మెచ్చిటయ్యె
         నహహ : యెందుకు కవులెరి యాధునికులు