పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

2.నా యెఱుక : దాసుగారి స్వీయచరిత్ర. సంగీత నృత్య సాహిత్య త్రికళాకుశల త్రిదశులైన వారి పూర్ణ పురుషాయుష జీవితమున చిత్రముగా నిది మొదటి ముప్పదేండ్లకే పరిమితము. "స్వయముగ చెప్పవలసిన అగత్యమున్నంతటి తన జీవితకధను మాత్రమే స్వీయ చరిత్రకారుడు వస్తువుగా స్వీకరింప వలయును; అన్యయైన జీవితకధను ప్రదర్శించు పని జీవిత చరిత్రకారునిది" అను నభిప్రాయము గల ఆ దేశద్రిమ్మరి సరస్వతీ ప్రచారకుని శేషజీవితము స్వయముగను వర్తాపత్రికల మూలమునను దేశమంతయు నెరిగినదే. మొదటి ముప్పదేండ్ల జీవిత నసన్నివేశములే వారికి దప్ప లోకమునకు దెలియనివి. అందుకే ఆ నామకరణ మన్వర్ధ మగుచున్నది. తెలుగులో 'సీయచరిత్ర ' ప్రకటనమునకు వీరేశలింగముగార్తే ఆద్యులైనను తద్రచన కద్యు లీ ఆదిభట్టే యని పెద్ద లనగా విన్నాడను ఆ. నా దాస జీవిత చరిత్ర 257వ పుటయందట్లే యున్నది. ఈ గ్రంధమున బాలదాసుయొక్క పాండిత్య పరాక్రమము, తద్విజృంభ లబ్ద విజయములతొపాటు ఆయన లోటు పాట్లను గూడ స్పష్టముగ గుర్తింపగలము. లబ్ధ విజయములతొపాటు ఆయన లొటుపాట్లను గూడ స్పష్టముగ గుర్రింపగలము. ఆయన వానిని బాహాటముగా చాటుకొనుటకు జంకలేదు. కొంకలేదు. కొన్ని కొన్ని సన్నివేశములు రసవత్తరములుగ నున్నవి. కధారక్తియేగాదు, అపురూపములైన ఉపమాద్యలంకారములతోడి కల్పనలు, వర్ణనలు నడుక కవితా కల్యాణికి సేవలు వెట్టినని, చందన చర్చలు చేసినవి. ఆ నడుమ పత్రికలలో పరంపరగా నిందలి కొన్ని ఘట్టములు ప్రకటితములైనవి కాని గ్రంధము నేటిదనుక అచ్చుమొగము చూడకుండుట అబ్బురము. త్వరలో ఇది శ్రీ కర్రా ఈశ్వరరవుగారి "దాస భారతి ప్రచుర్ణ" (గుంటూరు) గా వెలయనున్నది సంపాదకుడు: యస్వీ.

3.నూఱుగంటి : చూ. అచ్చ తెలుగు కృతులు.

4. వ్యాసపీఠము: దీని విషయము పూర్వోక్తము. (చూ. 'అచ్చ తెలుగు కృతులు ' -సం.13) ఇందు పూర్వభాగమున నొక సునిశిత వైమర్శిక దృక్పధము గల ఒక మహాద్రష్టను, ఉత్తరభాగమున సురుచిత కవితా దృక్పధము గల ఒక మహాస్రష్టను దాసుగారి యందు మనము దర్శింపగలము. ఎప్పట్టునను అనవద్యమైనది వారి గద్యశైలి. అది అచ్చజాన యైనను అంటు బాన యైనను వైశద్యము దాని జీవగఱ్ఱ.