పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
24

దా స భ ర తి

అ ను వా ద గ్రం ధ ము లు

1.ఉమర్ ఖైయాము రుబాయత్ : శ్రీ దాసుగారు పారశీకమున కండలు తిరిగిన పండితుడు. తన కనేక విషయముల సదృశుడు, సమానధర్ముడు, తనవలె కవియు కళాప్రమాత రసికప్రవరుండు మహాప్రవక్త భక్తవరుడు శాస్త్రవేత్త్ బహుదానవభావుడు యద్పనిష్యుడు అయిన ఉమర్ ఖయాము మహాబాగుని అంతరంగిక సంగీతమైన 'రుబాయతు ' అనవ్యాబ్యాలాసములకు ఇరియగుచున్నరని గుర్తించి మహాబాధపడి మదనపడి అందుకోనమన్నట్లు పట్టుబట్టి పారశీకము నేర్చి మూల గ్రంధ లీలా మలిమ్లురుడై కవి హృదయము నాచికొని దోచుకొని తత్పరమార్ధమును మన కందిచ్చినవారు. వారి గ్రంధము సమగ్ర సుందరముగా (అచ్చాంధ్ర పారశీక పదటిప్పణులతొ సహా) 1932 లో బొంబాయిలొ బ్రిటిషిండియా ప్రెస్సులో ముద్రితమైనది. అందు 110 రుబాయతులు వరుసగా పారశీక, రోమను లిపులలో వ్రాసి అవియు ఫిట్జ్ గెరాల్డుగారి ఆంగ్లానువాద పద్యము లొకవైపు సంస్కృతాంద్రానువాద పద్య గీతము లొక వైపుగను ముద్రితములైనవి. ఇందలి తెలుగు నిర్ధపు టచ్చతెలుగు. ఇట్లు రుబాయ్తునకు సంస్కృత, దేశ్యాంద్రము లందనువారములు వెలయించుటకు దాసుగారే ప్రధములు. వీరు ఫిట్జ్ గెరాల్డు ప్రతిపద్యమునకును ఒక సంస్కృత శ్లోకము ఒక తెలుగు పద్యము చొప్పున వ్రాసిరి. అసలు రుబాయతుయొక్క ఆపాత మధుర్ గీతధర్మమునకు దగినట్లు సంస్కృతమున నొక గీతి, తెనుగున నొక పాట చొప్పున వ్రాసిరి. (తెనుగు పద్యములన్నియు కందములు, దానిని 'స్కంద ' శబ్దవముగా భావించి నాటు తెలుగున దానికి 'మూపు" అని నామకరణము చేసిరి. కొద్దిచోట్ల మాత్రము తెలుగుపాట తేటగీరి యాటవెలదు లందు వడినది కాని పలుతావుల "చెండు" అను పేర మంజరియే ప్రయుక్తమైనది.) సంస్కృతాంధ్రములందు మూలభావము మాదమట్టుగా సంగ్రహించుడు. అనువాదమున స్వతంత్రకృతి యందు కవి యొక్క భావ వ్యక్తీకరన శక్తి ప్రదర్శిత మగుటకు గల వెసులుబాటు సక్రమముగ ఆలవోకగ ప్రకటించుట భాషాపరశేషభోగి యగు దాసుగారికే చెల్లినది.