పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ రసజ్ఞత ప్రభువున కంకితముగా. "నతతము మెసంగు సత్యవ్రతికిన్" అను మకుటముతో వెలసిన దిది. దాసుగారి నీతి నిపుణతకును, లొకజ్ఞతకును నికషొపల నీకృతి. ఎప్పుడో దెబ్బదేండ్ల క్రిందటనే ముద్రితమైనది.

6.సూర్యనారాయణ శతకము: దాసుగారి నామకరణ మసలు "సూర్యనారాయణ" అని ఆయన సూర్యదేవుని ఇలవేల్పుగా, ఇచ్చవేల్పుగా నుపాసించిరి. యావజ్జీవితము జీవనమునను సాహిత్యమునను పలు తావుల మాట నుద్ఘాటించుచు వచ్చిరి. ముగురయ్యల మూలపు టయ్యగా భావించి ఆ దేవరపై నొక శతకమునే పన్నిరి. "సూర్యనారాయణా" యని దాని మకుటము. శార్ధూల మత్తేభములు గృహీత వృత్తములు.ఒక మహాతాత్త్విక దృక్పధము దాని ప్రాణసారము. దాసుగరిది శ్రుతామనృత సుకుమార శుకానువాదప్రాయమైన మెట్టవేదాంతము కాదు. మరి, లొకమును లొగొన్న జీవితరహస్యమును జీర్ణించుకొన్న బావకూలంకషమైన ఒంటబట్టిన వేదాంతము. అదే యిందడుగున ప్రత్యక్షమగును. బక్తిభవ్యమైన ఆ సముదాత్తభావనరణింబడి సహృదయ పాఠకు డెక్కడికో పోడు, ఎద్ లోతులకు దిగిపోవును లేదానద్యోహృద్య సమున్నతానిభవసీమల కెగిరిపోవును. ఇక నిందలి కవిత్వ మందమా సందర్భ సుందరోపమలు, సద్య: పేయ పీయూషమువంటి భాష, నాగర్ధయోగ జాతకమగు శైలీలాలిత్యము మొదలగు కవితా సామగ్ర్రి యందచందముల కాలవాలము. ముద్రణ: వైజయంతీ ప్రెస్, మదరాసు, 1903. 7. వేల్పునంద: చూ. అచ్చ తెలుగు కృతులు.

రూ ప క ము లు

1. దంభపుర ప్రహసనము : స్వభావోక్తి సుభములైన పద్యములతో హాస్యసారస్యములతో నొప్ప రచన. ఇందలి పాత్ర లానాటి కతిపయ విజయనగర పుర ప్రముఖులకు ప్రతీకలట. ముద్రితము.1921, రచన: 1890

2. సారంగధర నాటకము: ప్రాక్రృతీచీన రూపకశైలీ మేళనము గల రచన. శాంతరస ప్రధానమయ్యు హాస్య కరుణాద్యంగరస పరిపోషణ సామ