పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

1929 కి ముందే ప్రకటితము. కాని తత్ప్రతులు లభింఛుటలేదు. అదిగాక తదుపరి పదునారు వత్సరముల జీవితచరిత్ర మున్నది దాసుగారికి. ఆకాలమున వారలవోక గావించిన యనిబద్ధ రచన లనేకములున్నది. ఆయన్నిటిని తెలిపి యొక బృహద్గ్రంధముగా రూపొందిచితిని. అది 1974 జనవరి లో ప్రచురింపబడినది.

3. తారేకం అపురూపమైన సంస్కృత కావ్యము. "సంస్కృత కృతులు" శీర్షిక క్రిందదీని గురించి చూడదగును.

శ త క ము లు

1.కాశీశతకమ్; సంస్కృత శతకము (చూ.'సంస్కృతులు ')

2.ముకుందశతకము: "కందశితానంద మూలకధ ముకుందా!" అను మకుటము గల ప్రతిపదసుందర, బావలబందురమైన రచన, ఇందు మహాభక్తకవియైన దాసుగారి మధుర హృదయస్పందము లనేకము విందుము. 1929 కి ముందే ముద్రితము. ప్రతులు దుర్లభము. రచన: 1903

3. మృత్యుంజయ శివ శతకము: దాసుగారికి, వారి హరికధలలొ పాటకచ్చేరీలలొ సహకారము చేయుచు అనేక సభలలో సెభాషనిపించుకొన్న గాందర్వదూర్వహుడు, సర్వతంత్ర స్వతంత్రుడైన దాసుగారిని కంటికి రెవలె సాకిన సహొదరుడు నైన పేరన్నగరు మృత్యు ముఖద్వారమున నున్నప్పుడా చెంగిట గ్రుక్కిళ్లు మ్రింగుచున్న దాసుగారి యెడద యేడ్చిన యేడ్పు ఈ శతకము. ఆ సహొదర సౌహార్ధ మెట్లు నాన్యతోదర్శనీయమో ఈ శతక మందలి కిదుష్ట వేదవాశ్రుతి అట్లనిర్వచనీయమైనది. రచన & ముద్రణ: 1908.

4. రామచంద్ర శతకము: చూ. "సంస్కృతకృతులు".

5. సత్యవతి శతకము: విద్యావినోది యగు ఆనందగజపతి ప్రభువునకును పుంబాన సరస్వతి యగు దాసుగారికిని గల హార్ధమైన అనుబందము దొడ్డది.