పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

       శక్తి లేమి నెఱిగియు లజ్జ న్దొఱంగి
        వేత్తవలె పటియించెద విదిశమున."
అనియు, ఈ 'కచ్చపి ' 58 వ పుటలో--
       "కాళిదాసుని రఘువంశ కావ్యము గను
        గొనియు, భవభూతి నాటకమును జదివియు
        బాణు గద్య మరపియు గవనము జెప్ప
        వెఱవ డద్దిర నా వంటి వెఱ్ఱివాడు"

అనియు తన వినీతిని మనస్సాను వివిస్రృత మధురాభిరుచి ప్రవంతిగ కొనిరి. ఇంకను పలుకృతుల పలుతావుల వారి కవితాభిరుచులు కొన్ని ప్రకటితములైనవి, ప్రహ్లాద చరిత్ర పీఠికలొ--

      పూర్వ కవు లందరున్ గ్డు పూజ్య లందు
      భాగవతు లయి గోస్తనీ పాకముగను
      గృతు లొనర్చు నధికుల సంస్కృత్మున జయ
      దేవు దెనుగున బొతనం దెలిసి యెంతు"

నని చెప్పుకొనిరి. మరికొన్ని తావులగూడ వీరిరువురను ప్రశంసించిరి. దాసుగారికి వీరిపై నేదో ప్రత్యేకమైన మక్కువ యున్నదన్నమాట. దాని కింకేమి కారణమై యుండును! ఆయిరువురు నీయన వలెనే జీవనమును కవనమునను పరమ భాగవతులు, ద్రాక్షాపాక రిరంసువులు, అంతేగాక కడు పిన్నటనుండియు పోతన పఠన ప్రావీణ్యమునకు బహుమతి నందిరి. ఉపరి పోతనయ్హు నీయనయు సహజ పాండిత్యధురీణులు, అంత్యప్రాస స్రవణులు, ప్రవీణులు, జయదేవుడు నీయనను మధుర సంగీత మధితాంతరంగులు, వెరసి మువ్వురును పరమతవుక పట్టభద్రులు, ఈయన కించునట్టి మరియొక జగదేక మహాకవి గలడు. "షెక్సిపియరుని వంటికవి నభూతోనభవిష్యతి" అనియు "తన కావ్య దర్పణంబున జగము నెల్ల జూసిన మహానుభావుడు భరతీయులలో వ్యాసుడు, ఆంగ్లేయులలో షేక్సిపియరని నాయభిప్రాయము" అనియు తన 'నవరస తరంగిణి పీఠికలో ఢంకా బజాయించి చెప్పిరి. కాళిదాసు కంటెను షెక్సిపియరు నధికునిగా సంబావించిరి. దానికి కరణము షెక్సిపియరు కవిగదచ్చక్షు నగుటయేకాదు--'షేక్సిపియరుడు సహజ పండితుడు. స్వతంత్ర కల్పనా చతురుడు. పరుల కట్టుబాట్లకు లొంగక యదేచ్చగా గావ్యంబు