పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లొనర్చెను. మఱియు బెక్కు శబ్దములను విజేచ్చాను పాఠార్దంబుల వినియోగించెను. కాళిదాసు ప్రాచీన నిబందనముములకు లోబడి కృతులొనర్చె." (చూ.శ్రీనారాయణ దాస వ్యాసపీఠము - పుట 163) ఈయన కచ్చివచ్చిన గుణములే షెక్సిపియరులో నున్నవి. అందులకే ఈయన కలత వచ్చినా డాయన.

సదసత్కావ్యవివేచనము:
  ఆషేక్సిపియర్కాళిదాసుల రసపోషణ విషయమై తాము రచించిన బృహద్గ్రందము 'నవరస తరంగిణి ' పీఠికలొ సదసత్కావ్యముల్ గురించి తెల్పుచు దాసుగారు. "మనసున కింపగు శబ్దార్ద సమూహము కావ్య మనదగినది. అనుటకే శబ్ధార్ధసమూహంవలన్ మనసున కుల్లసం గలిగి సత్కర్మాచణమున కుత్సాహము కల్గునో యట్టిది సత్కావ్యము. జనులకు భయ శోక జుగుప్సా క్రోధ ముల బుట్టించి దుర్మార్గమునకు బురికొల్పునది యనత్కావ్యము." అనియు, అందులోనే కవిత్వ ముఖ్యలక్షణమును, ప్రయోజనమును విశదీకరించుచు, "రసము చెడనీయక యమపుష్టిగ చెపుట, సందర్భశుద్ధి గల పదప్రయోగము, స్వతంత్రముగ కధను గల్పించి యపూర్వ మగు నూహంఅ దెల్పుట, అతుకుంచక పద్దెములల్లుట, పండిత పామర రంజకముగ మృదుంధురోచిత శబ్దంబుల న్బొందు పరచుటయు కవిత్వమున ముఖ్యాంశములు, సర్వసాధారణానుభవమును యధీచితంబుగ  దెల్పి జనుల హృదయంబుల కెల్ల రస ముప్పతిల్లం జేసి నీతి న్బోదించుటయే కవితకుందగు ప్రయోజనము" అని యుద్ఘాటించిరి. వేరొకచో  "ఖ్యాతిమీర మంచి కావ్యమున్ విరచించి కవి తాను తరించి లోకమున్ దరింపించు" ననిరి. తమ ప్రహ్లాదచరిత్ర పీఠికలో - అంధప్రాయమైన పూర్వ ప్రబందను కరణమును గర్హించిరి. ప్రౌడకల్పనల అనువృత మగు క్రిష్టబావనా మార్గమును విరచించిరి. వైశద్య మనుపేర పేలవత్వము ప్రదర్శించుటను తెడడిరి. (చూ. కచ్చపి. పుట 18) లోకవు  మానిసులలో తలచినట్లు చెప్పువారును, చెప్పినట్లు చేయువారును మిక్కిలి యరుదు.  యరుదైన వారిలో మిగుల నరుదైనవరు భావితాంత:కరణ శిరోమణి దాసుగారు. ఆయన ప్రకటించిన కవితాశయము లెల్లె ఆయన కవిత కవశ్యము చెల్లును.
ఒక మధురాశయము:
   తమ దైన మరియొక మధురాశయమునె భంగ్యంతరముగ సారంగధర నాటకమున నిట్లు సూచించిరి: