పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దా స భా ర తి

ప్రయత్నము

    తనదు లావుకొలది పని సేయకుండిన
    వాని మొఱ్ఱ నెవ్వరైన వినరు

--మాఱుగంటి


బంధము

     తగులు చెందినవాడు తగనెన్ననెడు.

--వేల్పుమాట


బుద్దిమంతులు

   వెనుక ముందు చూచుకొని తొందఱపడక
   వెలివిని గలుగు వారు తిరుగు చుంద్రు॥
   కలిగినంతలోన గడవు గొనుంగాని
   తెలివి గలుగువాడు కొలువ బోడు॥

మాఱుగంటి


బ్రతుకు

    తనదు బ్రతుకున తీపి లేదనెడు వాడు
    చావు చేరంగ వచ్చిన జానలేడు.

మాఱుగంటి


మంచిచెడ్డలు

   చెడ్డ పొగొట్టి మంచి న్బెంచవలయు
   మంచికి మించిన మనుగడలేదు
   నిజముగ చెడ్డ కంటెం జావులేదు.

--వేల్పుమాట


   పిన్నవారికైన పెద్దలకైనను
   మంచి చెడ్డ దెలుప మనసె సాక్షి.

భీష్మ చరిత్ర


మర్యాద

    మరియాద కలవాని మది సొమ్ము తనివి:
    తనవారి మర్యాద దప్పిన వాడు
    మనుటకంటె న్పుల్కుమారుట నయము:
    జగమునకు న్మేలు సలిపెడు కొఱ్కె
    తెలగుట తగు మానిషికి మరియాద.

--వేల్పుమాట