పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
40

దా స భా ర తి

II కావ్యసారణి

12. బాటసారి

57. ని దా ఘ వే

సీ॥ నెమరువేయుచు లేళ్ళు నీడల నాగె లో
          బొదలలో నెమళులు కుదురుకొనియె
     లోతు మడుంగుల నీతాడె నేన్గులు.
        పందులు బురదల బాదుకొనియె
     గొమ్మలపై జేరుకొనియె గోతులు, పుల్గు
        లన్నియుదొఱ్ఱుల వణగజొచ్చె,
    లోపల బడి పులు లావులింతలు దీసె
        నొండులలో దాము లూడ్చులుచ్చె
    నడని సందడి ఉగ్గె, నల్గడలయందు
    జెలగి పొగ చిమ్ముమొంచు కార్చిచ్చు హెచ్చె
    రెండు జాముల వేసవి మండినడుచు
    గొండ బీటలువాఱంగ నెండకాసె.

58. గారడి సూర్యుడు :

గీ॥ ఔరగారడి సూర్యుండ యబ్బురంబు
    కద బ్రతుకువలె నీ కరకొశలంబు
    అల్ప భౌమంబులన్టూపి యధిక దీవ్యక్త
    ములను గన్పట్టనీయక మోసపుచ్చుట