పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 88

వ్యాకరణ వ్యాఖ్యత లెల్లరును వ్రాసియున్నారు. ఇది యెంతయు సమంజసమే. తెనుఁగునకు సంస్కృత భాషలో రచితమైన వ్యాకరణములలో ఆంధ్రశబ్ద చింతామణి, అథర్వణ కారికావళి ముఖ్యములు. చిన్నయసూరి అథర్వణ వ్యాకరణమునుకూడ నుదాహరించెను. కాని దానికంత ప్రామాణికత నీయలేదు. ఆంధ్రశబ్ద చింతామణికే యత్యంత ప్రామాణికత మిచ్చి దాని ననుసరించుటయేకాక దానికొక వ్యాఖ్యానమును కూడ రచించియు నుండవచ్చును. కాని, యిప్పు డా వ్యాఖ్యానము లభ్యమగుట లేదు, చిన్నయసూరి వ్యాకరణ రచనమునకు నెట్టి పరిశ్రమ చేసెనో ఈ వ్యాఖ్య లభ్యమైనచో మనకు తెలియఁజేయఁగలదు. ఈ రచనా కాలమునాఁటికి సంస్కృత మూలమగు నాంధ్ర శబ్ద చింతామణి ముద్రితమై యున్నది. కాని, చిన్నయసూరి దాని నుపయోగించెనో లేదో తెలిసికొనుటకు మన కవకాశములు లేవు. పండిత లోకములో నిది ప్రచారమున నున్నట్లు లేదు.

విశ్వనిఘంటు టీక

చిన్నయసూరి సంస్కృత భాషలో నున్న 'విశ్వనిఘంటువు' నకు తెలుఁగున టీక వ్రాయ ప్రారంభించి, కొంత వఱకు రచించెనని 'సుజన రంజని' పత్రిక తెలుపుచున్నది.*[1] ఆ యసమగ్ర భాగమును లభింప లేదు.

  1. * ఈ విషయము 'చిన్నయసూరిని గూర్చిన యభిభాషణలు' అను శీర్షికలో చూడనగును.