పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 60

ఈగ్రంథ మిప్పుడు లభ్యముకాదు. *[1]

ఇందలి సూత్రములు పాణినీయాష్టాధ్యాయీ సూత్రములవలె రచితములైనవి. సూత్రములకు నుదాహరణము లిందు లేవు. "సిద్ధి లోకంబువలనఁ దెలియనగు - సిద్ధి ర్లోకాత్ దృశ్యా; శాసనం బియ్యది దిక్ప్రదర్శనంబు - (శాసన మితి దిక్ప్రదర్శనం" అను రీతిని సూత్రములు కలవు. ఇది భాషా సమష్టికి రెండవ సోపానమువంటిది. ఇట్టి సూత్రము లున్నవని కంఠస్థము చేయుటకు ననుకాలముగ నుండును. కావుననే చిన్నయసూరి ఇట్టి సూత్ర రచనఁ గావించినాఁడు.

ఆంధ్ర శబ్దానుశాసనము

ఇయ్యది సంస్కృత సూత్రముల రీతిని ఆంధ్ర భాషా లక్ష్యములతో రచితమైన వ్యాకరణము. ఇది కేవలము తెనుఁగు భాషను గూర్చి సంస్కృతములో వ్రాయఁబడిన గ్రంథము. దీనికి పద్యానువాదముకూడ చిన్నయసూరి గావించి యున్నాఁడు. దానిని గుఱించి ముందు తెలిపెదను. ఇదియును పై వ్యాకరణమువలె సంజ్ఞా, సంధి పరిచ్ఛేదములుగా విభజింపఁబడియున్నది.

ఇది సంజ్ఞ, సంధి, తత్సమ, ప్రకీర్ణ, క్రియ, తద్భవము లను నాఱుపరిచ్ఛేదముల క్రింద విభక్తమైనది. ఇందలి సూత్రము లీరీతిగ నుండును. "సిద్ధి లోకంబువలన గ్రాహ్యంబు." "శాసనం బీయది దిక్ప్రదర్శనంబు." "ఉత్వంబు కచ్చ రా

  1. * దీని కొక వ్రాఁతప్రతినివ్రాసి, కీర్తిశేషులు గిడుగు రామమూర్తి పంతులుగారి కిప్పటికి నలువదేండ్లక్రిందట నొసఁగితిని.