పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 61

సంధియగు." "ప్రాతాదులకు సమాసంబునం దాద్యక్షర శేషంబు బహుళంబు." "గుణవదాదికంబు హలంతం బమంత తుల్యం బిందునామంబగు." "దాని మకారంబు లోపించు." "ప్రథమాంతమున కస్మద్విశేషణంబునకు బహుత్వంబున మువర్ణకంబగు." "ఆగామి కర్మానుబంధతుమాద్యర్థంబుల ద్రుతంబునగు." "భూతంబునం దిత్వంబునగు." "ఆకాశాదుల మధ్యగంబునకు హ్రస్వంబగు. ఏకాంతాదుల బిందువునకు లోపంబగు."

పద్యాంధ్ర వ్యాకరణము

ఇది సూత్ర రూపముననున్న పైదానికి సూరి పద్య రూపమున రచించిన గ్రంథము. అందు పద్యరూప మసమగ్రముగా నున్నది. ఈ రెండిటి స్వరూపమును చూపించుటకు నారెండు గ్రంథములనుండి కొన్ని యుదాహరణములను పొందుపఱచుచున్నాఁడను.

గ్రంథ ప్రారంభము : -

                శ్రీమహిముఖ్య దివ్యమహిషీనయనోత్పలచారుదీధితి
                స్తోమమనారతం బగుచు జొప్పున బర్వుట నాగ మేచక
                శ్రీ మెయి దోప నొప్పలరు శేషధరాగ్రనికేతనుండు భ
                క్తాసురపాదపోత్తమ ముదారఫలప్రతిపాది గావుతన్.

            గీ. ఆద్యభాషకు నేఁబది యక్కరములు
                ప్రకృతి కవి పది కొఱవడి వరలు నిందు
                ముప్పదాఱగు నవి యస్యములును శబ్ద
                యోగవశమున పిఱుసొచ్చు నుదధిశయన.