పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 59

ప్రతిపరిచ్ఛేదాంతమునను -

"ఇది పరవస్తు చిన్నయసూరికృతంబగు శబ్దలక్షణనామ కాంధ్రవ్యాకరణమునందు.......పరిచ్ఛేదము."

ఇందున్న మఱియొకవిశేష మే మనఁగా, ప్రాచీనాంధ్ర వాఙ్మయమున పొడగట్టు సంబోధ నేతరవిభక్తిరూపములతో పరిచ్ఛేదాద్యములు కనుపట్టుచున్నవి.

ద్వితీయపరిచ్ఛేదము మొదలు - సంబోధన.

            క. శ్రీచరణసరోరుహలా క్షా చారువిలాసపక్ష సంశ్రితజనర
               క్షాచరణదక్ష దుష్టని శాచారకులశిక్ష శేషశైలాధ్యక్షా.

తృతీయపరిచ్ఛేదము - షష్ఠీవిభక్తి.

            క. శ్రీగృహమేధికి నతనిధి కాగమవేద్యునకుఁ ద్రిభువనారాధ్యునకున్
               భోగాపవర్గదాయికి నాగాధిపశాయి కంజనాధరపతికిన్.

చతుర్థపరిచ్ఛేదము - ప్రథామావిభక్తి.

            క. శ్రీనయనోత్పలశీతల భానుఁడు కలుషాంధకారభానుఁడు కరుణా
               ధీనుం డాశ్రితశుభసంధానుం డధ్యుషితశేషధర సానుఁ డొగిన్.

పంచమపరిచ్ఛేదము - తృతీయావిభక్తి.

            క. శ్రీలోచనాంజనాంక శ్రీలలితాధరునిచేతఁ జిరభద్రగుణ
                శ్రీలునిచేతన్ దీనకృపాళునిచేతన్ వృషాద్రిపాలునిచేతన్.

ఈ ప్రాచీనసంప్రదాయము నెఱిఁగినవాఁ డగుటచే సూరి యీగ్రంథము చివర నీక్రిందిసూత్రము గావించి యున్నాఁడు.

"స్వరూపవిభక్తినాయకవిశేషణంబులతోడ నాశ్వాసాంతంబు నందు మీఁదం దదాదిని విశేష్యాంతంబులతోడను మంగళం బార్యు లభివర్ణింతురు."