పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 53

"ఆ యీశ్వరుఁ డాయాయి జంతువులకుఁ దత్తసమరూపమయిన వృత్తినిఁ గల్పించువాఁడు." ఈశ్వరుఁడు వృత్తిని గల్పించువాఁడు - ఇది మూలవాక్యము. ఆయాయి జంతువులకు అనుసరి వృత్తి కల్పనతో సంబంధము. "తత్తదనురూపమైన" వృత్తికి విశేషణము. "ఆ" ఈశ్వరునికి విశేషణము.

ఈ విధముగా వాక్యవృద్ధిరచనాపరిజ్ఞాన మావశ్యకము.

ప్రాచీనకాలమున నన్నయభట్టారకుని రచన ననుసరించుచు నవీన వచన రచనాపద్ధతుల సమ్మేళనమున లక్ష్య లక్షణ సమన్వయముచేసి నూతన పథకము నేర్పఱచుటవలన నవీన వచన రచనకు చిన్నయసూరి మార్గదర్శకుఁడయ్యెను.

కథలు - నీతులు

నీతిచంద్రికయందలి నీతులను, అందలి కథలను ఇందు పొందుపఱచుచున్నాను.

సుదర్శనుఁ డను రాజు మూర్ఖు లగు తనపుత్రులఁగూర్చి వగచి విష్ణుశర్మ యను బ్రాహ్మణునియొద్ద వారిని విద్యాశిక్షణ కొఱకై ప్రవేశపెట్టెను. అతఁడును నీతిని బోధించు కథలను వారికి వినిపింపఁగోరి మిత్రలాభము, మిత్రభేదము, విగ్రహము, సంధి అను నాలుగంశములు గల కథను వినుపించును.

వీనిలో మిత్రలాభము, మిత్రభేదము నను రెండు మాత్రమే యిందున్నవి. అందు మిత్రలాభమున స్నేహము వలని లాభములను తెలియఁజేయు కాక కూర్మ మృగ మూషికముల కథ చెప్పఁబడినది. ఈ కథలోనే కొన్ని యుపకథలు కలవు. అవియును నీతిబోధకములే. వానిలో "ఆశ యన