పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము 52

ధనతృష్ణమానికోలు = ధనతృష్ణన్ మానికోలు - ద్రుతలోపసంధి.

తృష్ణ _ ఒకటి - ఇచట సంధి లేదు.

ఈ విధముగా సంధులు పరిజ్ఞాన మావశ్యకము.

ధనము గోరుటకంటె - "కోరు" సాధురేఫ

ఒక్క కొఱఁత - శకటరేఫ.

ఈ విధముగా రేఫ శకట రేఫ పరిజ్ఞాన మావశ్యకము.

వృత్తి-ఋకారము; తృష్ణ - ఋకారము; దరిద్ఁరుడు - రేఫ ఉకారము.

ఈ విధముగా కొమ్ము క్రారవడి వట్రువసుడి పరిజ్ఞాన మావశ్యకము.

"అడుసు ద్రొక్క నేల కాలు గడుగ నేల" ఇది ప్రసిద్ధమైన తెలుఁగుసామెత.

ఈ విధముగా సామెతలపరిజ్ఞాన మావశ్యకము.

"హంసములను శుకములను మయూరములను శుక్ల హరిత చిత్రములఁ గావించె." యథా సంఖ్యాలంకారము.

ఆకాశమందుఁ బక్షుల చేత భూమియందు వ్యాళముల చేత జలముల యందు మీలచేత మాంసము భక్షింపఁబడినట్లు సర్వత్ర విత్తవంతుఁడు భక్షింపఁబడియెడును - ఉపమాలంకారము.

ఈ విధముగా నలంకారపరిజ్ఞాన మావశ్యకము.

వినాశ = వి + నాశ - ఉపసర్గము - ఇచట "వి" కి అర్థము లేదు. నిస్పృహత్వము = నిర్ + స్పృహత్వము. ఇం దిది నఞ్ అర్థకము = లేకపోవుట.

వి + వేకము = ఉపసర్గము.

సన్నికర్షము = సం + ని + కర్ష - ఉపసర్గములు.

అర్థాంతరముల నిచ్చునది:

"సంగతి" = సం + గతి - ఉపసర్గము అర్థాంతరము నిచ్చునది. ఈ విధముగ నుపసర్గపరిజ్ఞాన మావశ్యకము.