పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 51

ఈ భాగము నుదాహరణముగాఁ గైకొని వచనకావ్య రచనకు ముఖ్యముగా తెలిసికొనఁదగిన యంశముల నెట్లు విద్యార్థులు గ్రహింపవలయునో స్థాలీపులాక న్యాయముగా నిందు చూపుచున్నాను.

ఎవ్వఁడు - అరసున్న సిద్ధము.

చిత్రములఁ గావించెను - సాధ్యము. ఎఱుఁగక - సిద్ధము - వ్యర్థముగాఁ బోఁగొట్టు - సాధ్యము.

భక్షింపఁబడియె - సాధ్యము.

కొఱఁత - సిద్ధము.

ఈ విధముగా సిద్ధసాధ్యములైన యర్ధానుస్వారముల పరిజ్ఞాన మావశ్యకము.

చిత్రములఁగావించెను = చిత్రములన్ + కావించెను - ఇది ద్రుత ప్రకృతికము; జంతువులకుఁ దత్తదనురూప = జంతువులకున్ + తత్తదనురూప - దృతప్రకృతికము.

వ్యర్థముగాఁ బోఁగొట్టుచున్నారు.

వ్యర్థముగాన్ + పోన్ + కొట్టు = ద్రుతములు.

ఆకాశమునందుఁ బక్షులచేత; భూమియందు వ్యాళములచేత = ఆకాశమునందున్ + పక్షులచేత; భూమియందున్ + వ్యాళములచేత - ద్రుతప్రకృతికములు.

ఈశ్వరుఁడాయాయి - ఈశ్వరుఁడు కళ. తత్తదనురూపమైన - అనురూపము కళ. వృత్తికై పడరాని - "వృత్తి" కళ. ఏల - కళ. తృష్ణ యొకటి - తృష్ణ కళ.

ఈ విధముగా కళాద్రుతప్రకృతికముల పరిజ్ఞాన మావశ్యకము.

ఈశ్వరుఁ డాయాయి - ఈశ్వరుఁడు + ఆయాయి.

ఉకారసంధి: కాఁపుదలయందొక. కాఁపుదలయందున్ + ఒక - ఉకారసంధి.

ధనముఁగోరుట = ధనమున్ + కోరుట - సరళాదేశ సంధి.