పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నయసూరి జీవితము. 45

చిన భారతవర్ష మహామహోపాధ్యాయ శ్రీ కొక్కొండ వేంకటరత్నం పంతులవారు విగ్రహ తంత్రమును పూర్తిచేసి ప్రకటించిరి. ఆ మరుసటి సంవత్సరమునందే రాజమహేంద్రవరములో గద్యతిక్కన కుందుకూరి వీరేశలింగం పంతులుగారు విగ్రహ భాగమునేకాక సంధినికూడ సంపూర్తి చేసిరి. వీరిరువురి శైలియు చిన్నయసూరి శైలిని వెన్నాడుచు ధారాశుద్ధిఁ గలిగి మనోహరముగ నుండును. వేంకటరత్నము పంతులవారి శైలి యించుక జటిలము; వీరేశలింగముగారి శైలి ప్రసన్నము. ఈ రెండు గ్రంథములనుకూడ మదరాసు విశ్వవిద్యాలయము వారు ప్రథమశాస్త్ర పరీక్షకు పఠనీయ గ్రంథములుగా నేర్పఱచిరి. వీరి వెనుక నెల్లూరియందు 'విద్యార్థి కల్పభూజ' మను పత్రికకు సంపాదకులగు ఉల్లిగొండ రామచంద్రరా వను ఆంధ్ర పండితుఁడు సంధి విగ్రహములను వచన రూపమున రచించెను. ఈతని శైలియు ప్రౌఢముగ నుండి పైవానికి తీసిపోకుండ నుండెను. దీనినిగూడ నొకప్పుడు కళాశాలయందు పఠనీయ గ్రంథముగ నేర్పఱచియుండిరి. శ్రీ ఉల్లిగొండ రామచంద్రరావుగా రిప్పటి కర్ధశతాబ్ది క్రిందట జీవించి యుండిరి. చిన్నయసూరి కాలమునకు కొంచెము వెనుక నుద్దండ పండితుఁడగు శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి యొక పంచతంత్రమును రచించెనని ప్రతీతి. నవీన కాలములో చెఱకువాడ వెంకటరామయ్యగారు నీతిచంద్రికయందలి లబ్ధనాశము మాత్రము ప్రాచీన శైలి ననుసరించి దీర్ఘ సమాసయుక్తముగ