పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రముల యుత్పత్తి క్రమము 13

మందు ముఖ్య ప్రమాణము. ఈ గ్రంథము బారెడేల్ దొరచేత నింగిలీషు చేయఁబడ్డది.

(5) మాధవీయము - ఈ గ్రంథము మాధవాచార్యులు చేసినది. ఇది పరాశరస్మృతికి ముఖ్యముగా వ్యాఖ్యానము.

ఈ యయిదు గ్రంథములు పరమప్రమాణముగా గణింపఁబడుచున్నవి. కనుక నే వీని సంఘాతము పంచగ్రంథియని యుదాహరింతురు.

(6) వరదరాజీయము - ఈ గ్రంథము వరదరాజను పండితుఁడు చెప్పినది. ఇది స్మృతి చంద్రిక వంటిదే.

(7) స్మృతి ముక్తాఫలము - ఈ గ్రంథము వైద్యనాథ దీక్షితులు రచించినది గనుక వైద్యనాథ దీక్షితీయమనియును వాడఁబడుచున్నది. ఇందు వైదిక విధులు వివరింపఁబడుచున్నవి.

(8) నిర్ణయసింధువు - ఈ గ్రంథము కమలాకర భట్టుచేత రచియింపఁబడినది. ఇందు లౌకిక వైదిక ధర్మములు చెప్పఁబడుచున్నవి.

(9) మన్వర్థ ముక్తావళి - ఈ గ్రంథము మనుస్మృతికి వ్యాఖ్యానము. ఇది కుల్లూకభట్టుచే విరచింపఁబడుటఁబట్టి కుల్లూకభట్టీయమనియును వాడఁబడును. ఇదే యిప్పుడు ప్రసిద్ధమైన మను వ్యాఖ్యానము.