పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రముల యుత్పత్తి క్రమము 12

కాండములు. రెండవ కాండమందలి దాయభాగ ప్రకరణము కోల్ బ్రూక్ దొరచేత నింగిలీషు చేయఁబడినది. ఆ కాండమందు మఱికొంత భాగము - డబ్బిల్‌యు-ఏచ్చి-మెక్ నాటన్ దొరచే నింగిలీషు చేయఁబడినది. మితాక్షర కాశీ సంప్రదాయమందు ముఖ్య ప్రమాణము. అందుచేతనే ద్రవిడ సంప్రదాయమందు సహితమది ప్రమాణముగా గ్రహింపఁ బడుచున్నది. ఈ గ్రంథనామము ధర్మశాస్త్రమునకు ముఖ్య ప్రవర్తకుఁడయిన మనువుయొక్క గ్రంథ నామముతోఁజేర్చి రెంటికి సాధారణముగా మను-విజ్ఞానేశ్వరీయమని పేరుపెట్టి యిందు సమస్త ధర్మములు చెప్పఁబడియున్నవని వాడుదురు.

(2) స్మృతి చంద్రిక - ఇది దేవనభట్టుచే రచింపఁబడినది. ఈ గ్రంథము చన్న పట్టణ దేశమందు గలిగి యక్కడనే యాచరింపఁబడుచున్నది. ఇది మితాక్షరకు రెండవదిగా గణింపఁబడుచున్నది. ఈగ్రంథము కొన్ని సిద్ధాంతములయందు మాత్రము మితాక్షరకు విరోధించుచున్నది.

(3) సరస్వతీ విలాసము - ఈ గ్రంథము స్మృతి చంద్రికవంటిది. దీని కర్త ప్రతాపరుద్రుఁడు.

(4) వ్యవహార మయూఖము - ఈ గ్రంథ మర్థ వ్యవహార దండ వ్యవహారములు తెలుపుచున్నది. దీనికర్త నీలకంఠుడు. ఇది మహారాష్ట్ర సంప్రదాయ