పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాస్త్రముల యుత్పత్తి క్రమము 14

(10) దత్త మీమాంస - ఈ కృతి నంద పండితుఁడు చేసినది. దత్త చంద్రిక - ఈ కృతి దేవానందభట్టు చేసినది. ఈ రెండును దత్త విషయకము లయిన గ్రంథములు. ఆ విషయమందు ముందు చెప్పిన సర్వ సంప్రదాయములవారికిని బ్రమాణమయి యున్నవి. ఈ రెండు గ్రంథములు సదర్ లాన్‌డు దొరచేత భాషాంతరము చేయఁబడినవి. మఱియును దత్త మీమాంసయని పేరుగల గ్రంథములు రెండు గలవు. అందొకటికి మాధావాచార్యుఁడు కర్త. మఱియొకటికి శ్రీరామపండితుఁడు.

బంగాళ
సంప్ర దా
యమునకు
ముఖ్య ప్ర
మాణము.

7. జీమూత వాహనుడుచేసిన దాయభాగమను గ్రంథము బంగాళ దేశమందు దాయభాగమునకు ముఖ్య ప్రమాణము. కోల్ బ్రూక్ దొరచేత నిది యింగిలీషు చేయఁబడినది.





జగన్నాథ
నిబంధన
గ్రంథము.

8. జగన్నాథీయమను నాధునిక ప్రకరణ గ్రంథము - సర్ - ఉల్లియం - జోన్సుగారు జగన్నాథ పండితునిచేతఁ జేయించినది. ఇది కోల్ బ్రూక్ దొరచేత నింగిలీషు చేయఁబడినది. ఇది సకల శాస్త్ర సంగ్రహమయియున్నదిగాని సిద్ధాంతముల యేర్పాటు మాత్రము లేదు. ఇందు సంగ్రహించిన పరస్పర విరుద్ధ వచనములయందు సిద్ధాంతవచనమిది యని యేర్పడకున్నది. ఇది భాషాంతరము చేసిన