పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ నాఁడు రాజకీయముగా స్వాతంత్ర్యమును బడసి చిన్నయసూరి యాంధ్రభాషలోనే సమస్త ప్రభుత్వ వ్యవహారములు జరుగవలెనన్న యాశయమును నూఱేండ్ల క్రిందటనే గుర్తించి యాంగ్లేయ భాషానువాద పథకము నేర్పఱిచిన దీర్ఘదర్శి.

న్యాయస్థాన విచారణలు, తీర్పులు - ఈ నాడు చాల భాగము ప్రాతబడినవియై యుండవచ్చును. కాని యా కాలమున మూలగ్రంథములనుండి యనువాదము లెంత జాగరూకతతో నొనరించెడువారో తెలిసికొనుటకు ఈ 'హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము' తోడ్పడును. చిన్నయసూరి యద్వితీయ వచన రచనకు ద్వితీయమైన ఈ గ్రంథము నాంధ్ర విద్వల్లోక మాదరించును గాక.

నిడుదవోలు వేంకటరావు.