పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హిందూధర్మ శాస్త్ర సంగ్రహము

1. ప్రకరణము

శాస్త్రముల యుత్పత్తిక్రమము

శ్రుతి
స్మృతులు.

1. హిందువులు తమ శాస్త్రములీశ్వరోక్తలని చెప్పుదురు. అందొకభాగము శ్రుతియనఁబడును. శ్రుతి యనఁగా ధర్మశ్రవణమునకు సాధనమని యర్థము. ఇదియె వేదము. ఇందు ముఖ్యముగా మత విషయములు చెప్పఁబడుచుండును. అది బ్రహ్మ ముఖమునుండి బయలు వెడలి, వెడలిన మాటల వరుసనే వ్రాతయం దేర్పడినదని నమ్మెదరు. మఱియొక భాగము స్మృతి యనఁబడు. స్మృతి యనఁగా స్మరింపబడినదని యర్థము. ఇందు ధర్మస్థానములకుఁ గావలసిన వ్యవహార విధులు చెప్పఁబడి యున్నవి. స్మృతికి ఋషులు ప్రవర్తకులని యెంచుచున్నారు. (1: 315 కో; మార్లి 1. అవతారిక 188)

మూల
ములు-
వ్యాఖ్యాన-
ములు-నిబం
ధన గ్రంథ
ములు.

2. ఇట్లు స్మృతులు వ్యవహారవిధుల కాకరములు. వీనికి వ్యాఖ్యానములు కానబడుచున్నవి. ధర్మశాస్త్రమందలి సర్వాంశములనుగాని కొన్ని యంశములనుగాని వివరించు ప్రకరణ గ్రంథములును గలిగినవి. ఇవియె నిబంధన గ్రంథములని వాడుదురు. (1. పీఠిక 11; మార్లి 1. అవ. 192)