పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంకోచిల్లక నిర్ణయించినాఁడను. అయినను నా కిట్టి తాత్పర్యభేదము లొకానొకచోటనే ప్రసక్తించినవి.

ఈ విషయమందు యథా ప్రాప్తముగా జ్ఞానము సంపాదింపవలెననియు దుష్కరములైన శాస్త్రాంశములు విడువక లెస్సగా వివరింపవలెననియుఁ గోరి సదరదాలతు కోర్టువారి పుస్తకశాలయందుండు సకల ధర్మ శాస్త్రములను బరిశీలించి సదరదాలతు కోర్టు ప్రొవిన్షియాల్ కోర్టు జిల్లాకోర్టుల పండితులు తమ యధికార స్థానములందు వ్రాసియిచ్చిన యభిప్రాయములును హర్మేజస్టీ ప్రివి కవున్సలువారు తీర్చిన తీర్పులును సదరదాలతు కోర్టువారి తీర్పులును వెలి దేశముల యందు యూరోపు దేశీయులయిన న్యాయాధిపతులచేతఁ దీర్పఁబడి యచ్చుపడిన తీర్పులును గలిగిన సమస్త లేఖ్యముల నాలోడించినాఁడను. ఇదిగాక సదరదాలతు కోర్టు పండితులతోఁ బలుమా ఱీ శాస్త్ర విషయమునందుఁ జర్చించుచు రాఁగా వారు నాకు సంశయ నివర్తకముగా నా గ్రంథ రచనకు మిక్కిలి సహాయముగా ధర్మశాస్త్రమందలి మూల ప్రమాణము లుదాహరించి నా రచించిన గ్రంథము పరిశీలించిరి. పశ్చిమ సముద్ర ప్రాంత దేశమందుఁ జెల్లుచున్న మరుమక్కదాయ మను నియమమును దద్దేశమందలి, ముఖ్యులయిన న్యాయాధిపతులు చెప్పిన విషయములఁ దెలిసికొని వ్రాసితిని. ఇదిగాక యీ శాస్త్రాంశమునందు నాకు సహిత