పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

"ఎలిమెన్ట్స్ ఆఫ్ హిందూ లా" అని పేరు పెట్టి మా తండ్రిగారయిన సర్ తామన్ స్ట్రెంజిగారు చేసిన గ్రంథమును ముఖ్యముగా ననుసరించి యీ ధర్మశాస్త్ర సారసంగ్రహము చేసినాఁడను. మా తండ్రిగారు చేసిన గ్రంథము మన ధర్మస్థానములందుఁ బ్రమాణముగా గ్రహింపఁబడి వాడఁబడుచున్నది. ఆ గ్రంథము మాటిమాటి కచ్చుపడకపోయినది కాఁబట్టి యది యచ్చువేయింప వలసినదా, యిప్పుడు నేను రచించిన రీతిని సంగ్రహ గ్రంథ మొకటి రచియించి ప్రచురము చేయవలసినదా యని శంకితుఁడ నయితిని. మా తండ్రిగారి పరిశ్రమమును వారి కాలమునకు వెనుక మన ధర్మస్థానముల యందు నడుచుచు వచ్చిన వ్యవహారముల తీర్పులను సహాయ పఱుచుకొని యా విషయములు కూర్చి సులభ క్రమమయిన సంగ్రహ గ్రంథ మొకటి చేయవలసినదేయని తుదకు నిశ్చయించి కొంటిని. అయినను మా తండ్రిగారు నిర్ణయించినదే సరియని కన్నులు మూసికొని పరిశీలింపక యొప్పుకొన్నవాఁడనుగాను. నా కగపడ్డ న్యాయముఁబట్టి మా తండ్రిగారి తాత్పర్యములకు నా తాత్పర్యములు భేదిల్లినచోట నాకుఁ దోఁచిన సిద్ధాంతము