పుట:2015.396258.Vyasavali.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విన్నపము.*

    ఎందుకీ కొత్తతెలుగు పత్రిక మరిఒకటి? దేశములో కావలసినన్ని ఉన్నవే పత్రికలు,అనేక విధములయినవి వాటివల్ల నెరవేరనిదీ, దీనివల్లనే కాదగ్గదీ ఏమున్నది విశేష ప్రయోజనము? ఈ ప్రశ్నకు ప్రత్త్యుత్తరము వివరించి మనవి చేస్తున్నాము. చదువరులు సావధానముగా పక్షపాతము లేక చిత్తగింతురుగాక!
    నిజమే; అనేక పత్రికలున్నవి; పత్రికాధిపతులుగా సంపాదకులూ చాలా కష్టపడి, ధనము కర్చుపెట్టి జనులకు అనేకవిధాల ఉపకారము చేయడానికి ప్రయత్నము చేస్తున్నారు. వారి ఉద్దేశము దొడ్డదే, వారి ఉద్యమము కొనియాడదగినదే; గాని, వారి ఉద్దేశము చక్కగా నెరవేరలేదనిన్నీ, వారి ఉద్యమము పూర్ణముగా  ఫలించకుండా కొంతమట్టుకయినా వ్యర్దమవుతున్న దనిన్నీ మాకు తోస్తున్నది. ఇట్లే పుస్తకములు వ్రాస్తూఉన్నవారి ఉద్యమమున్ను సార్దకము కావడములెదు. వ్యర్దముగా ధనము వెచ్చించడమే కూడని వ్యసనమంటారే; ధనముకన్నా ఎక్కువ విలువ గల దేహబలము వ్యర్ధముగా వెచ్చించడము ఎంతకీడోగదా! కాశీకి వెళ్లదలచుకొన్న వారు పొగబండి -- అందులోనూ మేల్ బండి--ఎక్కి ఫోక ఎడ్లబండిలోనో కాక ఎక్కువ పుణ్యమని కాలినడకనో ప్రయాణముచేస్తే, ఏమంటారు లోకులు! అర్ధణా కవర్లలోపెట్టి పంపించవలసిన శుభలేఖలు కూలి మనుష్యుల చేతనో బ్రాహ్మణుల చేతనో పంపించి ఎక్కువ

_____________________________

   *ఈవ్యాసము మేము సనాతన సత్సంప్రదాయాను పాఠముగా వాడుకలోనున్న తెలుగు భాషలో వ్రాసినాము. ఈ సంప్రదాయము అనేకగ్రంధములలో కనబడుచున్నది. ఈ సంచిక లోనే మూడో వ్యాసములొ దానికి ప్రమాణములు చూడనగును. ఇందులో మేము వాడిన శబ్దములు నూరేండ్లకు పైగా తెలుగువారిలో పెద్దలు వాడుతూ ఉన్నదే.   (ప.సం)