పుట:2015.396258.Vyasavali.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

వ్యాసావళి

కనబడదు. ప్రాచీనశాసనములలో అరసున్నకురు గురుతుగా నిండుసున్ననే ఉంటుంది; కొన్నిటిలో అను నాసికవర్ణమే ఉంటుంది (మల్లుణ్ణు అని) మీదచెప్పిన శాసనములలో "పరగు"శబ్దమందు బిందువులేకున్నా, అవిమర్శపూర్వకనియమమును అనుసరించి అంధ పరంపరంసరాగతమై అరసున్న దూర్చి పరిష్కరించి తమపాఠము ప్రకటించినారు.

 "పాకనాటి" "కమ్మనాటి" అని కొణిదెన శాసనములో ని సబిందుశబ్దములు పరిష్కరణములో నిర్భిందువు లయినవి.
   అచ్చుబారతముతో "ఎందుబోయితివి" అని "ఎందు"కు పరమందు అరసున్న, దానికిపరమందు 

గ జ డ ద బాదేశములు కనబడుతున్నవి; కాని వ్రాత ప్రతులలో అందు, ఇందు, ఎందు కళలుగాను వాటికి పరమందున్న కచటతపలకు గ స డ ద వాదేశములు రావలసినట్టుగాను పాఠములు కనబదుచున్నవి. ఈశాసనములలోకూడా, తాటాకు పుస్తకములలొ ఉన్నట్టె మూలమందుపాఠములున్నా సంస్కృతపాఠములు అచ్చుపుస్తకములలొని తప్పు పాఠములను అనుసరిస్తున్నవి. యుద్ధమల్లుని శాసనమందు "ఇందుప్రత్యక్షమై" అని మూలమందుంటే "ఇందుబ్రత్యక్షమై", అని పంతుల వారు దిద్దినారు. కొణిదెన శాసనమందు "తమ్ముండు ప్రతాపమున" అని మూలమందున్న "తమ్ముడు ప్రతాపమున" అని పరిష్కృత పాఠమందున్ను ఉన్నవి. అచ్చుభారతములోకూడా అక్కడక్కడ ప్రాచీన సంప్రదాయము కనబడుతున్నది. (చూ.విరాట.III 28. ఆనంద ముద్రణము--ఉర్వీజముల్ వ్రాకి) కొణిదెనశాసనమందు మూలము లో ఆదేశములు యధావిధిగా ఉన్నవి. "ముల్లోకవిభుండు సక్రి" అని కృతికర్త వ్రాసినది తప్పుగానిరాకరించి "ముల్లోకవిభుండు చక్రి" అని పంతులవారు దిద్ది అట్లుదిద్దుటకు కారణము ఏమని చెప్పినారో చూడండి; "విభుడు చక్రియను నవి రెండును సంస్కృతశబ్దములేయగుటచే జవర్ణమునకు సవర్ణమురావచ్చునని వైయాకరణుల మత