పుట:2015.396258.Vyasavali.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

57

రాజరాజ కాలమందున్న తెనుగుభాష

మయినను నిచ్చట సవర్ణము శ్రుతి కటువుగానున్నది. మఱియు జవర్ణము తాలవ్యము. సవర్ణము ద్మత్యోచ్చారణము గలది.” ఇట్లు తమ యిష్టానిష్ట ములే సాధుత్వాసాధుత్వములకు ప్రమాణముగా విధించి ప్రాచీనుల కృతుల లోని భాష దిద్దుటకు సాహసించేవారు ప్రాచీనాంధ్రభాషానుశాసకులుగా నుండుట ఆంధ్రభాషాపాండిత్యము నోచిననోముల ఫలముకాక మరేమిటి? తిక్కన విరాటపర్వమందు “ఎలుంగుసలింప” (చూ.11.139)అనివ్రాసి నాడయ్యా అంటే పంతులవారు “మాచెవికి ఇంపుగాలేదు గనుక తప్పే; తుడిచిపారేయవలెను“ అనిశాసిస్తారు; లోకము నోరుమూసుకొనవలసినదేనా? శ్రీనాదుమహాకవి క్రీ.శ.1416 వ సం. జనవరి తే 14 దీని స్వయముగ రచించి వ్రాసి సంతకముచేసి రాతిమీద చెక్కించిన శాసనములోని భాష “శిలాక్షరములు“ నేటికిన్ని ఉన్నది. దానిలో “అరిరాయబనువంశంకరుండు” అని రాజుయొక్క బిరుదు పేర్కొన్నాడు. అందులో ఉన్న “బనువ” శబ్దము తప్పని “బసవ అని చదువుడు“ అనిపరిష్కర్తలు అనుశాసించినారు. అనితల్లికలువచేరు శాసనములోకూడా (చూ.98 వ పంక్తి) “బసువశంకర:” అనివున్నది. అది తప్పని ఈపరిష్కర్తలు చెప్పక ఊరకున్నారు. అప్పుడు అది ఒప్పుగా కనబడ్డదికాబోలు, వారిచిత్తం, ఆంధ్రభాషభాగ్యం! శ్రీనాదుడు నైషధమునందు (చూ.IV.145)”అరివీరబసువశంకర” అనివ్రాసినట్లు అనేక వ్రాతప్రరులలో కనబడుతున్నది. కాని, వేదము వేంకటరాయశాస్త్రుల వారు పరిష్కరించి అచ్చువేయించిన పుస్తకములో “బసవ” అని ఉన్నది. శబ్దరత్నాకరమందు “బసవడు” “బసవన” ఉన్నవి; గాని “బసవలేదు. పంతులవారలు శాస్త్రులవారలు ఏప్రమాణమునుబట్టి “బసవ” తప్పన్నారో చెప్పరు.

  పైనివివరించి చెప్పినదానినిపట్టి ప్రాచీనాంధ్రభాషాస్వరూపము నిష్కృష్టముగా నిశ్చయించి నిరూపించుటకు తగిన సాదనాసామగ్రి సంపన్నముకాలేదని చదువరులు తెలుసుకోవచ్చును. అందుకు ఆధారముగా ఉన్న