పుట:2015.396258.Vyasavali.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

55

రాజ రాజ కాలమందున్న తెనుగుభాష

నిరూపణమునకు ఆధారమయిన సామగ్రిగా ఎన్నదగినవి. వీటినిబట్టి వాస్తవమైన భాషానియమ ములు తెలిసికొని, అచ్చుపడ్డ భారతాది ప్రాచీనగ్రంధము లందున్న కోశములందున్న వ్యాకరణములందున్న గలదోషములు తొలగించవలసిఉండగా, ఆదొషములు సాధువులుగా గ్రహించి, వాటికి అనురోధముగా శాసనములలోని భాషదిద్దటడము పంతులవారికి అవశ్యకమని, ఉచితమని తోచడము ఆంధ్రభాషా పాండిత్యముయొక్క దౌర్భాగ్యమని నాపరితాపము తెలియజేస్తున్నాను. తాటాకులమీద వ్రాసిఉన్న చంద్రభానుచరిత్రము*మూలమునకు విరుద్ధముగా కొన్నిశబ్దములరూపము దుష్టలక్షణము ప్రకారము మార్చి పరిష్కరించి ఆంధ్రసాహిత్యపరిషత్తువారు అచ్చు వేయించినట్లె రామయ్య పంతులవారు పరిష్కరించిన పాఠములుగల గ్రంధమే శాసనముల గ్రంధముగా అచ్చువేయించి ప్రకటించి ఉంటే, పరిష్కర్తలు చేసిన మార్పులేవో తెలియక కృతికర్తలువ్రాసినవే అని లోకము మోసపోవుటకు కారణమవును. అయితే మూలమునుబట్టి వీరు చేసిన తప్పులు దిద్దుకొనుట విమర్శకులకు కష్టమయినా అసాధ్యముకాదు. ప్రాచీనాంధ్రభాషా విశేషములలో ఆదేశములు, ఆగమనములు, అరసున్నలు మొదలయినవికొన్ని స్పష్టముగా నిరూపించలేక లాక్షణికులు తప్పులుజేసినారు. అటువంటివి సవరించుటకు ఈ శాసనములలో సాధక మయిన ప్రయోగములున్నవి. అవి పంతులువారి పరిష్కరణములో చెడిపోయినవి. రెండుమూడు అంశములు మాత్రమే ఉదాహరిస్తాను. "పరగు" శబ్దములో అంత్యవర్ణము బిందుపూర్వకముగా శబ్దరత్నాకరమందున్నది. అందుకు ప్రమాణముగా ఇచ్చిన మార్కండేయ పురాణములోని ప్రయోగము అచ్చుపెద్దగ్రంధములో కానరాదు. చక్కగావ్రాసిన తాటాకుపుస్తకములలో కూడా(భారతాది ప్రాచీన గ్రంధములందు) పరగు శబ్దములో అరసున్న _________________________________

  • నేను స్వయముగా తైఫారువేసి చూచినాను. వ్రాత ప్రతిలోనున్న శబ్దములు అచ్చులో కనబడవు.