పుట:2015.396258.Vyasavali.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి మాటలతో అగ్గము వ్రాసినారు. వాల్మీకి రామాయణములోని కొంత భాగ మునకు, సంస్కృతభాగవతములోని కొంతభాగమునకు, శ్రీశైలమహాత్మ్య మునకు, సౌందర్యలహరికి, శ్యామలాదండకమునకు, భర్తృహరినుభాషిత రత్నావళికి, కృష్ణకర్ణామృతమునకు వాడుక భాషలో రచించినతీకలు ఆ భాండాగారమునం దే ఉన్న వి. వైష్ణవమతధర్మమును బోధించే అరవపు స్థ కములకు తెలుగుటకలు ఇప్లేఉన్న వి. ఇక ను, తెలుగుప్రబంధములకుకూడా తెలుంగుటికలు పాడుక భాషలో రచించినవే ఉన్నవి గాని, గ్రాంథిక భాషలో నున్న ది మచ్చుకు ఒక్కటైనా ఎక్కడా ఇదివరకూ కనబడలేదు. • రాఘవ పొండవీయమునకు ప్రఖ్యాతపండితుడు ముద్దరాజు రామన్న; హరిశ్చంద్ర నళోపాఖ్యానమునకు చిత్రకవి అనంతుడు; వసుచరిత్రకు సోమ నాగపండి తుడు, శిష్టుకృష్ణమూర్తిశాస్త్రి, జూలూరి అప్పయపండితుడు; మహాభారత మునకు భారతము లక్ష్మీపతి పండితుడు, మనుచరిత్రకు జూలూరి అప్పయ. పండితుడు; ఆముక్తమాల్యదకు గుట్టుపల్లి నృసింహకవి, గుడిపాటి వెంకటకవి; రాఘవయాదవపొండవీయమునకు బాలసరస్వతి (?), లంకావిజయమునకు గ్రంథకర్త శిష్యుడు కోసూరి కృష్ణమాచార్యుడు, రామకృష్ణోపాఖ్యానము నకు కావ్యకర్తానూ వారణాసి లక్ష్మీపతికవిన్నీ చేసినటీకలు వాడుక భాష లో నే (సాహిత్య పరిషత్పండితులూ గవర్నమెంటు పుస్తక భాండాగారమం దున్న పండితులూ నివేదించినట్లు) సంభాషణ శైలిని రచిత మైఉన్న వి. వీటిలో కొన్ని ప, చిన్న యసూరికి, పూర్వము, కొన్ని ఆపిమ్మటను మొట్ట మొదట అచ్చు పడ్డప్పుడు, వాటిలోనిటీక వ్రాతప్రతులలో ఉన్న ప్లే వాడుక భాషలోనే ఉన్నది. పరవస్తు చిన్నయసూరిగారున్ను వైయాకరణ రామా నుజాచార్యులవారున్ను కలిసి పరిష్కరించి 1847–వ సం.న భారతము ఆది పర్వము ఆచ్చు వేయించినప్పుడు, భారతవచనమ నే పేరు పెట్టి ఆపుస్తక మందే, ఆచార్యులవారు ఈ ఛాయా వ్యాఖ్యానము” వాడుక భాషలో రచించి