పుట:2015.396258.Vyasavali.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

97

విన్నపము

అన్నిభాధలు తెల్పినాడు. తెలుగువారికి తెలిసిన తెలుగుమాటలచేతనే రసస్పూర్తికలుగునని ఒప్పుకిన్నాడు; “కాననీ యాంధ్రకృతులందు గలుగు నట్టి పనులకు నెల్ల నర్దమేర్పడెరీతి!నద్బుతంబుగ గృతిని జేయంగ వలయు! నర్దమైన రసస్పూర్తి యగుట యరుదె“

   జనులందరూ ఏక కుటుంబములోని వారని ఎన్నుకొని జజ్తిభేదములు పాటించకుండా ప్రవర్తించే ఉదార చరితుల వలెనే, భాషలన్నిటికీ  ప్రయోజనము ఒకటే అని తెలుసుకొని, ఏ భాష ఎవరికి సుపరిచితమో వారికి ఆ భాషే జ్ఞాననసంపాదనమునకు యోగ్యమైనదనిన్నీ తెలియని భాష ఎంతప్రాచీనమైనా నిరర్దక మనిన్నీ దూరదృష్టిగల లోకజ్ఞలు అంగక్రిస్తారు. తాతగారు తవ్వించిన నూయి అని ఉప్పు నీళ్ళైనా తాగేవారు కాపురషుంటగదా! ఎవరైతే నేమి? తనకుహితమైనదే లోకానకంతా హితవుకాక తప్పదనుకోవడము వివేకము కాదు.
   ‘కొన్ని జీవులు చిరసి ఱాల్ కొఱికి బ్రతుస!కొన్ని నునుసోగ నెన్నెలల్ గ్రోలి పొదలు !భిన్నరుచులైన వానికి బ్రీతి సరియ! తగవుగారిందులో ననేకతరగర్హ ‘* అని దమయంతి తనకు ఇష్టుడు నలుడేకాని సురపతి అయినా ఇంద్రుడు కాడని చెప్పినట్లు తెలుగువారు తమభాషయందభిమానము కలిగి ఉండడము తప్పుకాదు. పూర్వకవులు వాడిన దైనా ప్రచీనాంద్రముకన్న వర్తమానాంధ్రభాషే సుపరిచితమైనది గనుక దానియెడల ఎక్కువ ఆదరము చూపడము దోషముకాకూడదు; మెచ్చదగినదే కావలెను. ‘దప్పి గొన్నట్టి వారికా దప్పినీఱ! సలిలపూరంబు హితవో? యాజ్యంబు హితవో?’ అన్నకవిహృదయము స్పష్టము. తిక్కన కవికూడా తనకస్లమందు వాడుకలో ఉన్న తెలుగును ఆఅదరించి పాత తెలుగును ఎట్లు నిరసించినాడో చూడండి.

———————————————————————————————————————————————

  • శ్రీ వే వేంకటరాయశాస్త్రి గారు పరిష్కరించిన పాఠము లోని నాల్గవ చరణములో యతిభంగము మావద్దనున్న తాటాకుపుస్తకములోని పాఠము:- ‘తగవుగా దిందులో నేకతరవిగర్హ ‘