పుట:2015.396258.Vyasavali.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
96

వ్యాసావళి

అందులో ఉన్న గ్రంధములు చదువుకొని అర్ధంచేసుకోవడ మసాధ్యము. జ్ఞాన ఉ వల్లగాని మనుష్యులు వృద్ధి పొందలేరు. జ్ఞానము కలగడానకు ఏ భాష అయుతేనేమి? పరిచయముగల భాషలో బోధించినది తెలుసుకోవడము సులభము గనుక అపబ్రంశ నున్నాసరే * గ్రామ్యమన్నా సరే, వైకృత మన్నా సరే @ లౌకికభాషలోనే కావ్యములుకూడా వ్రాయవచ్చును. కావ్యమనగా రసవంతమైన వాక్యము. రసమునకు ప్రధానమైనది శబ్దము కాదు; శబ్దార్ధము. మాట అనీ అనడముతోనే రసము స్ఫురించితేనే కాని ఆనందముకలుగదు; శృంగారరసము కానీ, భక్తిరసము కానీ, అట్టి స్ఫురణ వాడుకలో ఉన్న మాటలవల్లనే కలుగుతుంది—ఇదీ ఆ మహాత్ముల ఉడ్దేశము. ఈ ఉదారభావమే కర్పూర మంజరిలో రాజశేఖర కవి తెలియజెప్పినాడు. నాటకమంతా(ఉత్తమ పాత్రల వాక్యములుకూడా) ప్రాకృతములోనే రచించి, అట్లు రచించింసందుకు, సంస్కృతభాష మగవానివలె మోటుగా ఉంటుంది; ప్రాకృతమైతే సుందరివలె సుకుమారమైనది. స్త్రీ పురుషుల కెంత భేదమున్నదో అంత భేదమున్నది ప్రాకృతమునకున్ను సంస్కృతమునకున్ను; ఉక్తి విశేషము కావ్యము; వట్టి శబ్దములుకావు; భాష ఏదైతే అదే కావచ్చును. అని సమాధానము చెప్పినాడు.

   ఇట్లే తన ఆంధ్రభాషార్ణవములో కోటి వెంగనార్యుడు “దేవతల భాషగావున దెలుగుకన్న! సంస్కృతము మిన్నయాయుక్తి సరియె ఆతెలిసి! రసికుడగువాడు తనదుజాఱుసికలో న ! దులసినే యుడుకొనునొ జాదుల నెయిడునొ?” అని ‘సంస్కృతము తులసివంటిది; తెలుగు జాజిపువ్వుల వంటిది ‘

————————————————————————————————————————————————

  • ”అప్పకవెర్యము” (బొబ్బిలి బాల్య భాష)

@ క్షితిమ్లేచ్చ...వ్యవహారహాని నంధిలుతనన్—-నిడువగూడదు.

 అప్పకవీయము1-169.