పుట:2015.393685.Umar-Kayyam.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

43

167

వ్యసనములందు నిన్ను బలియై చనుమంచు వచింతురేని, నా
వసతి వియత్తలం బనుచు వాడెదరేని, త్వదీయవాస మీ
వసుధ తిరంబుగా దిఁక నుపాస్యము మిథ్యగదా ! త్వదాత్మలో
బొసఁగఁ దలంపు మీవసలె పుట్టఁగలేదని ; గిట్టు టుండునే !

168

ఈవు ధరిత్రి నస్థిరుఁడవేని గృహంబులు కట్టి గర్వివై
పోవుదు వేల ? దీనులను బూర్వులలీలఁ దలంచెదేల ? ఝం
ఝానిలజృంభణంబున నిజంబుగ దీపముఁబెట్టినట్టు లా
శై వలినీప్రగభమున సౌధము గట్టినయట్లు గాదొకో !

169

"సోనను" నా "సరూ" తరువుఁజూచి స్వతంత్ర లటందు రాద్యు లా
సోసను పెక్కు వాక్కులను శోభిలుచున్న వచింపబోవ దెం
తో సొగసైన నాసరువు తోరపు హస్తములున్నఁ జాపకే
వాసము సేయుఁగావునఁబ్రపంచము మెచ్చును వానిఁజూచినన్.

170

తురగంబుల్, రణ రంగవస్తుచయముల్, తోరంపురత్నంబు, లం
బరపంక్తుల్, నడుమంత్రపుం గలుములున్ భావించి గర్వించి సం
బరమున్ బొందకు ; కాల మేరి నయినన్ మన్నించెనే ? నేఁడు సుం
దర భాండంబును, ఱేపు దాకను ద్రుటిన్ దన్నున్ రజంబైచనున్.