పుట:2015.393685.Umar-Kayyam.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ఉమర్ ఖయ్యామ్

171

ఈ దుష్కాలము పెక్కుమంది బలి గావించెన్ దయాశూన్యయై
భూదేవిన్ జనియించుపుష్పచయ మా బూదిన్ రజంబై చనున్
గాదే యో యువకాగ్రణీ ! సొగసుకై గర్వింపఁగాబోల ; దా
లేదవ్వన్ వికసించి యెన్నివిరు లోలిన్ రాలెనో చూచితే.

172

శక్తివంచన లేకుండ, సాధుసేవ
నప్రమత్తుఁడవై చేయు ; మస్థిరంబు
మహిత సౌందర్య మనెడు సామ్రాజ్యపదము
నిన్ను విడనాడి పోవు దాకొన్ననేని.

173

ఎల్లవారిచే నుతిఁగాంచ నెంచెదేని
పూని "యూధు" నైనను, "ముసల్మాను" నైనఁ
"గ్రైస్తవుని" నైనఁ జాటునఁ గానియేని
తిట్టఁగా రాదు వానితీ రెట్టిదైన.

174

కామార్థము నీ ప్రాణము
వేమాఱును గష్ట పెట్టి వేచెద వేలా
నీ మాయాసంసారము,
కామితము లొకప్డు నిన్నుఁ గడతేర్చుఁ జుమీ.