పుట:2015.393685.Umar-Kayyam.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఉమర్ ఖయ్యామ్

163

సాంతముఁ బాపపుణ్య నిచయంబు నెఱింగిన ధీరులున్ గత
భ్రాంతిని దమ్ముఁ దామును బ్రపంచమునున్ మఱపొంది నిస్పృహ
స్వాంతులు నైనవారును, నిజంబుగ నీ ప్రకృతిస్వరూప దు
ర్దాంత దురంతజాల విషరాశిఁ దరింతు రభీష్టసిద్ధులై.

164

మృగయుఁడ వీవు కానియెడ నే మృగయుండ వటంచుఁ బల్కఁగా
దగ ; దటు లేపదార్థము యథార్థ మెఱుంగవొ దానిగూర్చి చె
పఁగ వల ; దట్లె తత్త్వములు పాడకు నేరనిచో నెఱింగి చె
ప్పఁ గలుగుదేని నట్టి బుధవర్గముతోఁ గనుసన్నఁ జెప్పవే.

165

త్యాగులఁ గన్నఁ దోడ్పడి సహాయముసేయుము ; వాదభేదముల్
లాగియుఁబాఱవేయు ; మకలంకుఁడ వైన "నుమర్‌ఖయ్యాము" వా
క్యాగమ మాలకించి మధురాసవపానము, వాద్యగానముల్
భోగములెల్లఁబుచ్చుము ప్రపుణ్యలసేవ సతంబు చేయుచున్.

166

ఈ జగతీరహస్యము నెఱింగినవాఁడు సుఖంబు దుఃఖ మే
యోజఁ దలంపఁ ; డీసుఖములో వ్యసనంబులొ వచ్చి పోవు సం
యోజితలీల నీవిల సుఖోన్నతిఁ దేలెదొ, లేక దుఃఖ సం
భాజన మయ్యెదో జడము భంగిని సమృతిదావకీలలన్.