పుట:2015.393685.Umar-Kayyam.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

39

151

పగవాఁ డాడెడునింద లెప్పుడును భావంబందుఁ జింతింప ; కా
పగతుం డెప్ఫుడు బాహ్యచక్షువులు లేవన్ నిన్ను వీక్షింపఁ ; డా
వగ హృద్దర్పణమందు వాని మృతరూపంబున్ విలోకించి మా
యఁగ నారోపణ సేయు నొడ్లపయి రౌద్రావిష్టుఁడై క్రూరతన్.

152

సజ్జనుల హింస సేఁత పైశాచికంబు
క్రూరమృగభావ మది మానుకొనఁగవలయు ;
కలిమి గలదని భ్రాంతిని గర్వపడకు,
విద్య గలదని తెగ విఱ్ఱవీఁగబోకు.

153

అలసుఁడవుగాక, కర్మల నాచరింపు ;
మాగతికి నేను గాపౌదు ; నాసవమ్ము
తెమ్ము ; కలయంతలో నర్థికిమ్ము కొంత ;
అన్యరక్తంబు విత్తార్థ మాసపడకు.

154

పురుషుఁడవు కమ్ము ; మమకారమును ద్యజించి
యీషణంబుల చెఱ వీడు ; మిచ్ఛ లెల్ల
బాధ లవి నీకు మార్గావరోధకములు
గాన యవి త్రెంచి చను విశృంఖలుఁడ వగుచు.