పుట:2015.393685.Umar-Kayyam.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

ఉమర్ ఖయ్యామ్

147

ఈవు గొప్పవాఁ డగునెడ నెవనికైన
సరియె యిబ్బంది రానీయఁ జనదుసూవె
చావునకు వెఱఁగంద కశనమునకును
వగవఁబో; కవి వేళకే వచ్చు చుండు.

148

ఉర్విఁ గష్టాలు పడి శ్రమ కోర్వకున్న
భోగములు, నిష్టసిద్ధులు పొందలేవు
కంకతిక వంద బ్రద్దలు కాకయే ప్రి
యాలకంబులు దువ్వగాఁ జాలఁగలదె?

149

పరు లాడు తిట్లు చెల్లవు
పరులకు మన మొక్కకీడుఁ బఱపిన నూఱై
చెఱుచును గావునఁ బూనికఁ
ఒరులకు నుపకృతులె సేయవలయును సతమున్.

150

నీవు పరుల మేల నెంచిన, వారలు
నీదు కీడు సతము నెంతురేని
వారు మేలు చూడనేరరు; నీవెప్డు
కీడు జీవితానఁ జూడఁబోవు.