పుట:2015.393685.Umar-Kayyam.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఉమర్ ఖయ్యామ్

155

అతిదూరంబు కృతాంతవీథిఁ జని యేరైనిందు రాలేదు ; త
ద్గతి గుహ్యంబులు చెప్ప లేదు; క్షణమాత్రంబైన నీ జీవిత
ప్రతతిన్ నమ్మకుమా ! నిజాశయము జాఱన్ భ్రాంతి నాశాలతన్
క్షితిఁ గాసైనను దాఁపఁబోకు మది భక్షింపంగ రాలే విఁకన్.

156

ఓ చెలీ ! నిన్ను నేఁ గలియకుండఁగఁ జేతులు చాచి కోరికన్
నీ చెఱఁ గంటకుండ, విడనేరను ; నీవఱ కేగుదారి యెం
తో చకితంబు, దూరమయి తోఁచిన నేఁ జనిపోదుఁ గాని రా
నోచక వెన్కకున్ మరలవోపఁ బథశ్రమ మెంతగల్గినన్.

157

నరకాగ్నింబడు బెంగఁ బొంద ; వవమానంబన్న నీరంబులోఁ
బరితోషంబున స్నానమాడిన భవత్ప్రాయంపు దీపంబు దు
ర్మరణార్తిశ్వసనంబు లార్పునెడ నిన్ మాయించు నీ భూమియే
శరణంబిచ్చునొ లేదొ చూడు ; మదియే శంకింతు నశ్రాంతమున్

158

కపట దురంతచింత లెదఁగాంచక మద్యముఁ గ్రోలి, తోషివై
విపులస్వతంత్రతన్ గని, దిగంబరివై, సురసేవనుండవై,
యపహృత వృత్తిఁ బూరుషుఁడవై తరియింపుము ముజ్జగంబు నీ
వెపుడును బూర్ణతత్త్వపద మీగతిఁ బొందెదు నిశ్చయంబుగన్.