పుట:2015.393685.Umar-Kayyam.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉమర్ ఖయ్యామ్

27

103

కలికి ! నామానసంబు దుఃఖమునె గాని
సుఖమెఱుంగదు ; తినెడు వస్తువులలోన
నాసవమె గాని యొం డేపదార్థ మెఱుఁగ
నోసి ! మధ్వాసవంబు నాకొసఁగు మబల !
యీ యుషఃకాలమున శీధు విడిన నుసురు
నిలుపుకొందును ; నుసురులో విలువ యొక్క
క్రీస్తెఱుంగును నెఱుఁగ రీకీలు పరులు.

104

శీధువు పాత్రనుండిపడి చేయుకలధ్వని వేణుగానపు
న్మాధురి యెంతహాయినిడు మానిని కౌఁగిట నద్ది చారు సం
బోధనలన్ వెలార్చు నిజభోగపరంపర నాసవాప్తి సం
బాధము లాహహా యెటు ప్రపంచవిచారము మన్పెఁ జూచితే

105

వ్యర్థవాంఛలఁ బడి జ్ఞాని వగవఁబోఁడు
మధువుఁద్రావుచు దుఃఖాన మనసు నుంచు
వానినెత్తి దుమ్మును గొట్టవలయుఁ గాదె
యేడ్చువాఁ డెప్డు మధుసేవ కేఁగవలదు.

106

ఆసవ మెప్డుత్రాగవలె ; నాత్మ కృతార్ధత నొందు ; దుఃఖపున్
వాసన మానసంబు విడఁబారగ శీధువు పానపాత్రలోఁ
బోసి యథేచ్ఛఁ ద్రాగుచును బూజ్యుల కిమ్మిది తెల్లమేగదా
యీ సచరాచరావని వసించుట కొన్నిదినాలె కాదొకో.