పుట:2015.393685.Umar-Kayyam.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఉమర్ ఖయ్యామ్

99

మధువున్ ద్రావి యథేచ్ఛ నుండుటయె నామార్గంబు ; పూర్వైకస
చ్విధులన్ సల్పుచు నొక్కఁ డీశుఁడని తృప్తిజెందుటే నామతం
బధినాథున్ డిటు లాడె నే నడుగ, నీ యానందమే నా దయా
వధి యంచున్ మఱి యేను ద్రాక్షరసమున్ వర్జింపఁగా నేటికిన్.

100

మధువున్ ద్రావుము నిత్యతోషమునకున్ మార్గంబు గానోపు ; నీ
మధువే ప్రాణహృదంతరక్షతములన్ మాయించు ; నల్వంకలన్
వ్యధ జంఝానిల మావరింపఁ దలక్రిందైపోయి దుఃఖావిలాం
బుధిలో మున్గిన "నూహు" నౌకవలె నిన్‌బోషించు సంభావ్యమై.

101

నేనయి పుట్టలే దిలను నేనయి చావ నిఁకెట్టులున్ దుదిన్
మేనును వీడి పోవలయు మిన్నక ; నెచ్చలి ! లెమ్ము ! కాసెతో
నీనడుమున్ బిగింపు ; మిఁక నేర్పున శీధువుఁదెమ్ము దానిచే
నీ నరలోకదుఃఖమలినేచ్ఛిలఁ బోఁగడతున్ యథావిధిన్.

102

ఈవసుధాతలంబు నివసింపంగఁ జోటును, నిల్వ నీడ యీఁ
బోవదు ; శిష్టులన్ వెతల ముంచును ధుష్టులఁ గావఁజూచుఁ గా
దే ! వగపేల ? యీ యనలమెల్ల జలాంజలి వీడి యార్పు మో
కోవిద ! వట్టిచేతులతొ గుందుచుఁ గాటికిఁ బోవనేటికో.