పుట:2015.393685.Umar-Kayyam.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఉమర్ ఖయ్యామ్

51

వనముల నెఱ్ఱపువ్వులు నృపాల రణాంగణ వీరరక్త సం
జనితములేమొ శోభితదశన్ నన లెత్తిన లేఁత కొమ్మ కొ
మ్మను జివురాకులొప్పు నవి మానినిచెక్కిళులేమొ యింపు సొం
పొనరెడు పుట్టుమచ్చ లననొప్పెడు నందలి చుక్క రారయన్.

52

మనకంటెన్ మునుపున్న విట్టి పగళుల్ మాపుల్ ప్రపంచించి యే
పనికో కాలము చుట్టుచున్న యది సర్పంబట్లు జాగ్రత్త! నే
లను గాలూదకు; నీ పదాహతిని లీలన్మీటు మ న్నే లతాం
గి నట ద్వీక్షణపంక్తిదో తెలియశక్యంబౌనె యెవ్వారికిన్ !

53

త్రుంపియుఁ బారవేయని యదోషసుమం బొకటైనఁ జెప్పి సృ
ష్టింపదు కాల; మేవనముఁ జేరిన మేఘము నీళ్ళమాఱుగాఁ
దెంపున ధూళి బ్రుంగి చనుదెంచిన పాంథుల నెత్తుటేఱె వ
ర్షింపఁగఁజాలు; నెందరు నశింపరు మట్టయిపోయి యీగతిన్.

54

"మూసా"లెందఱొ వచ్చిపోయిరిసుమీ భూమిన్‌'కొహోతూరు'గా
"ఈసా" లెందఱొ వచ్చిపోయిరిసుమీ యీధాత్రి ధైర్యంబుగా
"కేసర్లెం"దఱొ వచ్చిపోయిరిసుమీ యీక్షోణి"కైసారు"గా
నా సర్వస్వము వీడిపోయి రిల యాతాయాత సంరంభులై.