పుట:2015.393685.Umar-Kayyam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఉమర్ ఖయ్యామ్ మొదటి కూర్పు 1949 వ సంవత్సరమున జరిగెను. అప్పుడు ప్రభుత్వమువారి అనుమతిలేకనే కాగితములు లభ్యము కాకపోవుటచే 500 ప్రతులు మాత్రమే ముద్రింపబడినవి. అవి అచిరకాలముననే చెల్లిపోవుటచే తిరిగి ఈ సంవత్సరమున ముద్రించినాము. మొదటి ప్రచురణమునకై జ్ఞానసభాసభ్యులు మహాయోగిని శ్రీమతి అల్లూరి సత్తెయ్యమ్మగారు (లంకలకోడేరు) ధనసహాయము చేసిరి. ఈ రెండవ ప్రచురణము శ్రీ ఉమర్ అలీషాకవి గ్రంథప్రచురణ సంఘమువారిచే జరిగినది.

ఈ గ్రంథప్రచురణమందు తోడ్పడిన శ్రీ కవిగారి బాల్యస్నేహితులగు కవిరాజహంస శ్రీ వోలేటి పార్వతీశ్వరకవి గారికిని, మొదటి కూర్పునందలి అచ్చుతప్పులు సవరించిన శ్రీ బండారు తమ్మయ్యకవి గారికి మా కృతజ్ఞతా పూర్వకములగు వందనములు

శ్రీ సరస్వతీ ముద్రణాధికారులగు శ్రీ అద్దేపల్లి నాగేశ్వరరావుగారు శ్రీ కవిగారియెడల ఆదరాభిమానములు గలిగి ఈ గ్రంథమును జాగ్రత్తతతో ముద్రించి యిచ్చిరి. వీరికి మా అభివందనములు.

శ్రీ కవిగారు తెనిగించిన రుబాయీలు 714, కొన్ని పాఠాంతరములున్నవి. వాటికి కూడా సంఖ్య, ఒసగుటచే 720 పద్యములుగా ప్రకటింపఁబడినవి, వచ్చే ముద్రణమందు సవరించెదము.

ఇట్లు,

మదీన్ కబీర్‌షా

వారణాశి సత్యనారాయణశాస్త్రి

కార్యదర్శులు

శ్రీ ఉమర్ అలీషాకవి

గ్రంథ ప్రచురణ సంఘము

పిఠాపురము

9 - 7 - 53