పుట:2015.393685.Umar-Kayyam.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

456 బెనఫెషా = (బెనఫ్‌షా) ఇది ఒక అందమైన పుష్పము. కాని దీని మధ్య గులాబీకివలె పసుపురంగుగా ఉండదు. ఇది ముకుళించినట్లుండును.

464 బుల్‌బుల్ = పిగిలిపిట్టవంటి అందమైన పక్షి.

487 సరు = సర్విచెట్టువంటి ఒక అందమైన చెట్టు ఇది నిలువుగా నుండును.

512 పరహాద్, షీరిన్ = గాఢముగా ప్రేమించుకొన్న పారశీక ప్రియులు.

532 నూహునౌక = చూడు. ప. 100

550 సీముర్గ్ = ఆకాశముపై విహరిస్తు నివసించు ఒకజాతి పక్షి.

553 అబూసయీర్ = ఇతడొక గొప్పఋషి, మరియాంబు = ఏసుక్రీస్తుతల్లి ఏసుక్రీస్తు జన్మసమయమున ఈమె ఒక యెండిన ఖర్జూరపుచెట్టు క్రింద కూర్చుండెను, అప్పు డావృక్షము చిగిర్చి, కాచి, పండిన ఖర్జూరములను ఆహారముగా ఆమె పై పడవై చెను.

555 మోమిన్ = ఈశ్వర యేకత్వమున నమ్మకము గలవాడు.

559 మసీదుముతవల్లి = మసీదునందు ప్రార్థనములు చేయుటకై ఏర్పరచబడ్డవాడు.

578 జంభూవరుపాత్ర = జంషీదు అను చక్రవర్తి పానపాత్ర. ఇం దితడు ప్రపంచమందు జరుగు విషయములను చూడగల్గెడువాడు.

610 సులేమాన్ = ఇతడు గొప్ప చక్రవర్తి. పంచభూతములపై యితనికి అధికారము కలదని ప్రతీతి.

624 జమ్మను పానపాత్ర = చూ. ప. 578

634 యూసూఫ్ = ఇతడు మిక్కిలి సౌందర్యవంతుడైన ప్రవక్త.

683 జమషీదుని రుక్కలశంబు = చూ. ప. 578

665 జీసస్ = ఏసుక్రీస్తు. ఈయన మృతులను బ్రతికించెడువారు.