పుట:2015.393685.Umar-Kayyam.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టిప్పణి

పద్యము 54 ధైర్యంబుగా = (ఒప్పు) దైరంబుగా, దైర్ = ఆశ్రమము

55 జంషీదు = పారశీక చక్రవర్తి, బైరాం = పారశీక చక్రవర్తి.

64 తూసుగోట = తూసునగరపు గొప్పకోట

కైకావూస్ = పారశీక చక్రవర్తి.

100 నూహునౌక = నూహు అను ప్రవక్త జలప్రళయము వచ్చినప్పుడు ఒక నౌకను నిర్మించుకొని రక్షించుకొనెను.

141 హాతిము = ప్రసిద్ధిగాంచిన దాత హాతిమ్‌తాయి, రుస్తుము = పారశీకవీరుడు.

166 పోసన్ = ఒక అందమైన పుష్పము దాని దళములు నాలుకలవలె నుండును.

176 కాబా = మక్కా ప్రార్థనాలయ మందలి పవిత్ర శిల.

202 బగదాత్, బలఖ్ = ముస్లిం రాజ్యముల ముఖ్యపట్టణములు.

221 నమాజు = ప్రార్థన.

222 మహమ్మద్ = గజనీమహమ్మద్. అయాజ్ = గజనీమహమ్మదు బానిస (రాజు పేద అని అర్థము)

314 యూసూఫ్ = యూసూఫ్ ప్రవక్త, ఇతనీని తండాలు పట్టుకొని పది దీనారములకు విక్రయించిరి.

351 కైకుసరో = పారశీకదేశపు చక్రవర్తి, జమషీద్ చూ|| 55. మహమ్మద్ = గజనీమహమ్మద్.

380 హననెగావూదీ = (ఒప్పు) లహచెదావూదీ = దావూద్ ప్రవక్త ఇతని కంఠస్వరము మిక్కిలి మధురముగా నుండెడిది.

401 ఖిజిరు, ఇలియాస్ = ప్రవక్తల పేర్లు.

436 షాబాన్, రజ్జబ్బులు = ముస్లిం నెలల పేర్లు. ఈమాసములు పవిత్రములుగా ఎంచుదురు. ఈ మాసములందు ఉపవాసము లుండెదరు.